New Offer: రూ. 8,799 రూపాయలకే POCO M6 5G స్మార్ట్ ఫోన్ అందుకోండి.!

Updated on 09-Mar-2024
HIGHLIGHTS

రూ. 8,799 రూపాయలకే POCO M6 5G స్మార్ట్ ఫోన్

ఈ బెస్ట్ బడ్జెట్ 5జి ఫోన్ ఇప్పుడు గొప్ప ఆఫర్ తో లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం వచ్చింది

New Offer: రూ. 8,799 రూపాయలకే POCO M6 5G స్మార్ట్ ఫోన్ అందుకునే గొప్ప అవకాశం అందించింది. ఇండియన్ మార్కెట్ లో కేవ 10 వేల బడ్జెట్ కేటగిరిలో ప్రవేశించిన ఈ బెస్ట్ బడ్జెట్ 5జి ఫోన్ ఇప్పుడు గొప్ప ఆఫర్ తో లభిస్తోంది. ఇప్పుడు పోకో కొత్తగా ప్రకటించిన ఈ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం వచ్చింది. ఈ ఫోన్ ను Airtel Exclusive కాంబో ఆఫర్ తో ఈ ఫోన్ ఈ డిస్కౌంట్ ధరకే అందుకునే అవకాశాన్ని తీసుకు వచ్చింది.

POCO M6 5G New Offer

పోకో ఎం6 5జి స్మార్ట్ ఫోన్ ను Airtel Exclusive కాంబో ఆఫర్ తో జతగా కేవలం రూ. 8,799 ధరకే అందుకోవచ్చని తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను Flipkart పైన ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కొనే వారు ఈ ఫోన్ ను కేవలం Airtel Prepaid SIM Card మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. ఇప్పటికే ఎయిర్టెల్ సిం కార్డు ను ఉపయోగిస్తున్న వారికీ కూడా అయి ఆఫర్ వర్తిస్తుంది.

POCO M6 5G New Offer

ఇంతవరకు బాగానే వుంది కానీ మరొక మెలిక కూడా వుంది. అదేమిటంటే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కొనే యూజర్లు రూ. 199 మరియు అంతకంటే ఎక్కువ ప్లాన్ తో 18 నెలల పాటు రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. అయితే, ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కోన్ వారికి 50GB అధనపు డేటా కూడా లభిస్తుంది.

Also Read: iQOO Z9 5G: మతిపోగోట్టే డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తోంది.!

POCO M6 5G: ప్రత్యేకతలు

పోకో ఎం6 5జి స్మార్ట్ ఫోన్ Mediatek Dimensity 6100+ ప్రోసెసర్ మరియు జతగా 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుంటుంది. ఈ పోకో బడ్జెట్ ఫోన్ లో పెద్ద 6.74 ఇంచ్ సైజు కలిగిన HD+ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIUI 14 సాఫ్ట్ వేర్ పైన Android 13 OS తో పని చేస్తుంది.

పోకో ఎం6 5జి 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ 18 W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :