Poco X9 Pro Max ఫోన్ ఏకంగా భారీ 11000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతోందా .. కొత్త లీక్ ఏం చెబుతోంది.!

Highlights

Poco X9 Pro Max ఇండియా లాంచ్ గురించి ఇప్పుడు నెట్టింట్లో ఎక్కువగా చర్చ చర్చ జరుగుతోంది.

ఈ ఫోన్‌ కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు తాజాగా లీక్ అయ్యాయి

ఈ అప్ కమింగ్ ఫోన్ భారీ 11000 mAh బ్యాటరీ తో లాంచ్ అవుతుందని లీక్స్ చెబుతున్నాయి

Poco X9 Pro Max స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి ఇప్పుడు నెట్టింట్లో ఎక్కువగా చర్చ చర్చ జరుగుతోంది. ఎందుకంటే, పోకో నెక్స్ట్ లాంచ్ చేయబోయే ఫోన్ ఇదే అని చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఫోన్‌ కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు తాజాగా లీక్ అయ్యాయి. ఈ లీక్ కూడా ఈ చర్చకు కారణమనే చెప్పవచ్చు. ఈ అప్ కమింగ్ ఫోన్ భారీ 11000 mAh బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే మరియు శక్తివంతమైన ప్రాసెసర్‌ తో మార్కెట్లోకి రావచ్చని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Poco X9 Pro Max లీక్స్ ఏమి చెబుతున్నాయి

చైనాలో విడుదలయ్యే Redmi Turbo 6 Max కు గ్లోబల్ మార్కెట్లలో రీబ్రాండెడ్ వెర్షన్‌ గా రావచ్చని తాజా లీక్స్ చెబుతున్నాయి. ప్రముఖ టిప్స్టర్ డెబియన్ రాయ్ ఇదే విషయాన్ని తన X అకౌంట్ నుంచి షేర్ చేశారు. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా ఈ ట్వీట్ నుంచి షేర్ చేశారు.

Poco X9 Pro Max లీక్డ్ / అంచనా ఫీచర్స్

లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ లో 7 ఇంచ్ 2K ఫ్లాట్ LTPS OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ మార్కెట్ చూడని 185Hz రిఫ్రెష్ రేట్‌ తో రావచ్చని సమాచారం. అంతేకాదు, స్క్రీన్ చుట్టూ చాలా తక్కువ బెజెల్స్ మరియు ఈ ఫోన్ లో మెటల్ ఫ్రేమ్‌ అందించనున్నట్లు కూడా తెలుస్తోంది.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ MediaTek Dimensity 9500s ప్రాసెసర్‌ తో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు లీక్స్ చెబుతున్నాయి. అయితే, కొన్ని నివేదికల్లో Dimensity 9500 లేదా 9600M చిప్‌ సెట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో 12GB వరకు LPDDR5X RAM మరియు 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ అప్ కమింగ్ ఫోన్ కెమెరా గురించి ఎక్కువ సమాచారం వెల్లడికాలేదు. ఈ ఫోన్ లో OIS సపోర్ట్‌ కలిగిన 50MP మెయిన్ కెమెరా జతగా అల్ట్రా వైడ్ కెమెరా ఉండవచ్చని సమాచారం. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ గురించి చెబుతున్న సమాచారం మొబైల్ ప్రియులకు మత్తెకించే విధంగా ఉంటుంది. అదేమిటంటే, ఈ ఫోన్‌ లో 11,000mAh భారీ బ్యాటరీ మరియు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి.

ఈ ఫోన్ లాంచ్ డేట్ ఎప్పుడు

ఈ ఫోన్ లాంచ్ లేదా మరే ఇతర వివరాలు ఇప్పటి వరకు కంపెనీ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. జస్ట్ ఈ ఫోన్ గురించి నెట్టింట్లో లీక్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఈ లీక్స్ ద్వారానే ఈ ఫోన్ 2027 మార్చి నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేసి చెబుతున్నారు.

ఈ ఫోన్ పైన వచ్చిన లీక్స్ కనుక నిజం ఈ ఫోన్ అతిపెద్ద డిస్ప్లే మరియు బ్యాటరీ కలిగిన ఫోన్ గా భారత మార్కెట్లో అడుగుపెడుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile