వన్‌ప్లస్ 9 ప్రో మరియు వన్‌ప్లస్ 9 లైట్ కెమెరా వివరాలు మరొకసారి లీక్ అయ్యాయి

Updated on 24-Feb-2021
HIGHLIGHTS

వన్‌ప్లస్ 9 ప్రో మరియు వన్‌ప్లస్ 9 లైట్ కెమెరా వివరాలు మరొకసారి లీక్

వన్‌ప్లస్ 9 ప్రో కెమెరా సెటప్ గురించి పూర్తిగా వివరిస్తున్నాయి.

వన్‌ప్లస్ 9 లైట్ కెమెరా ఎలా ఉండబోతుందని వివరిస్తుంది.

వన్‌ప్లస్ 9 ప్రో మరియు వన్‌ప్లస్ 9 లైట్ కెమెరా వివరాలు మరొకసారి లీక్ అయ్యాయి. ముందుగా, వన్‌ప్లస్ 9 ప్రో యొక్క కెమెరా వివరాలు మరొకసారి అవ్వగా, ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో వచ్చిన లీక్ వివరాలు వన్‌ప్లస్ 9 సిరీస్ సరసమైన ఫోన్ వన్‌ప్లస్ 9 లైట్ కి సంభంధించినవిగా తెలుస్తున్నాయి. ఈ ఫోన్లు వచ్చే నెలలో ఏదో ఒక తేదికి లాంచ్ చేయవచ్చని కూడా ఆన్లైన్ రూమర్స్ చెబుతున్నాయి.

ఈ లీకైన వన్‌ప్లస్ 9 ప్రో మరియు వన్‌ప్లస్ 9 లైట్ కెమెరా వివరాలు ఈ ఫోన్ల కెమెరా సెటప్ గురించి పూర్తిగా వివరిస్తున్నాయి. ఈ లీక్స్ లో తెలిపిన ప్రకారం, వన్‌ప్లస్ 9 ప్రో 48MP మరియు 64MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి జతగా మంచి ఆప్టికల్ జూమ్ అందించగల టెలీఫోటో కెమెరాని కూడా కలిగి వుంటుంది. అయితే,  వన్‌ప్లస్ 9 లైట్ మాత్రం 64MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని కలిగి ఉందవచ్చని, లీక్స్ వివరిస్తున్నాయి. కానీ, ఇవన్నీ కూడా ఆన్లైన్లో వస్తున్నా లీక్స్ మాత్రమే దీని పైన ఎటువంటి అధికారిక ద్రువీకరణ లేదు.

అలాగే, ఈ లీక్స్ నుండి ఈ వన్‌ప్లస్ 9 ప్రో స్నాప్ డ్రాగన్ 888 ప్రొసెసర్, పెద్ద QHD + డిస్ప్లే  మరియు 8GB ర్యామ్ తో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఇందులో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి కూడా ప్రస్తావించ బడింది. ఇక వన్‌ప్లస్ 9 లైట్ విషయానికి వస్తే, ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 690 ప్రొసెసర్,  8GB ర్యామ్ మరియు 5,000mAh బ్యాటరీతో  తీసుకొచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.                                       

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :