జియో నుండి దిమ్మతిరిగే అఫర్

HIGHLIGHTS

జియోఫోన్ 2021 ఆఫర్ వచ్చేసింది

రెండు సంవత్సరాలు అన్లిమిటెడ్ కాలింగ్

డైలీ 2జీబీ ఉచిత డేటా

కొత్త జియోఫోన్ 2021 ఆఫర్ వచ్చేసింది. అతిపెద్ద  టెలికాం ఆపరేటర్ జియో తన జియోఫోన్ ను ఒకేసారి 24 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ తో సహా కేవలం 1,999 రూపాయలకు అందిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా, ఈ అఫర్ ఎంచుకునే కొత్త చందాదారులకు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటాతో సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. అయితే, దీని కోసం రూ .1,499 చెల్లించాల్సి ఉంటుంది.   

పైన తెలిపిన ఈ ప్రయోజనాలను కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే కాదు, రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీని కోసం, చందాదారులు సింగిల్ పేమెంట్ గా రూ .1,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో, జియోఫోన్ మరియు 12 నెలల అన్లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. ఇందులో, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు 2 జిబి హై-స్పీడ్ డేటా ఉంటాయి. రోజువారీ ఉపయోగం కోసం.

అదనంగా, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారుల కోసం కూడా ఒక ప్లాన్ ప్రకటించింది. దీనితో, ఇప్పటికే ఉన్న జియోఫోన్ వినియోగదారులు సంవత్సరానికి 2GB రోజువారీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఇవన్నీ కూడా మరింత కేవలం 749 రూపాయల అఫర్ ధరకే  పొందవచ్చు. అయితే, ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఇప్పటికే ఉన్న JioPhone నంబర్లలో మాత్రమే ఈ ప్లాన్ యాక్సెస్ చేయబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :