సగం ధరకే మోటోరోలా స్మార్ట్ ఫోన్: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నుండి భారీ అఫర్

Updated on 07-May-2021
HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ భారీ అఫర్

ఈ సేల్ నుండి సగం ధరకే మోటోరోలా స్మార్ట్ ఫోన్

HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పైన 10% తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి సగం ధరకే మోటోరోలా స్మార్ట్ ఫోన్ ను అఫర్ చేస్తోంది. మోటరోలా నుండి వచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్ RAZR ఫోన్ను పైన ఏకంగా 63% డిస్కౌంట్ తో ఈ సేల్ నుండి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.  అంతేకాదు, ఈ ఫోన్ పైన ఈ సేల్ నుండి HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పైన 10% తగ్గింపు అఫర్ తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందించింది.     

గత సంవత్సరం, భారతదేశంలో మోటోరోలా ఈ ఫోన్ ను రూ.1,24,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్ డిజైన్ లో  వినూత్నమైనప్పటికీ, మధ్య-శ్రేణి హార్డ్‌ వేర్‌ తో వస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నుండి భారీ డిస్కౌంట్ తో రూ. 54,999 రూపాయల ధరకే లభిస్తోంది.     

మోటరోలా RAZR సెల్యులార్ సేవలను అందించడానికి eSIM టెక్నాలజీపై ఆధారపడుతుంది. ఫిజికల్ సిమ్ స్లాట్‌ తో రానటువంటి ఏకైక స్మార్ట్‌ఫోన్ ఇది.ఈ మోటరోలా RAZR అనేది మడతపెట్టగల స్మార్ట్‌ఫోన్, ఇది క్లామ్‌షెల్ డిజైన్ను కలిగి ఉంది, ఇది ఒరిజినల్ మోటో RAZR పేరుతొ ప్రాచుర్యం పొందింది. ఇది   600×800 పిక్సెల్స్ రిజల్యూషన్‌ తో బయట 2.7-అంగుళాల G-OLED డిస్ప్లేని కలిగి ఉంది. లోపల, 6.2-అంగుళాల P-OLED డిస్ప్లే ఉంది, ఇది ఫోల్డబుల్ డిస్ప్లే.

ఈ RAZR స్మార్ట్ ఫోన్, స్నాప్‌డ్రాగన్ 710 SoC  ఆక్టా కోర్ CPU మరియు అడ్రినో 640 GPU తో పనిచేస్తుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఫ్రంట్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 2510 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది.

RAZR వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అందులో ఎఫ్ / 1.8 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 16 MP SONY IMX519 ప్రైమరీ కెమెరా మరియు ToF 3D డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. ముందు వైపు, మీరు f / 2.0 ఎపర్చర్‌తో 5MP సెల్ఫీ కెమెరాను పొందుతారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :