Moto Edge 30 Pro మోటోరోలా నుండి వస్తున్న మరొక భారీ స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

Moto Edge 30 Pro ఈ నెలలో ఇండియాలో ప్రకటించవచ్చని రూమర్లు

Moto Edge X30 స్మార్ట్ ఫోన్ ఆధారితంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు

మోటోరోలా Moto Edge 30 Pro స్మార్ట్ ఫోన్ ను ఈ నెలలో ఇండియాలో ప్రకటించవచ్చని రూమర్లు వస్తున్నాయి. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను ఇటీవల చైనాలో ఆవిష్కరించిన Moto Edge X30  స్మార్ట్ ఫోన్ ఆధారితంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. అంటే, చైనాలో భారీ 60MP సెల్ఫీ కెమెరా మరియు Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియాకు చేరునట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే, Motorola తన Edge X30 ని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయాలని చూస్తున్నట్లు చాలా కాలంగా పుకారు ఉంది, కానీ దీన్ని వేరే పేరుతో లాంచ్ చేయాలని చూస్తోందని ఈ రూమర్లు చెబుతున్నాయి. ఈ రూమర్లు కనుక నిజమైతే 60MP భారీ సెల్ఫీ కెమెరా మరియు భారీ ఫీచర్లు కలిగిన ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో తాన్ తనదైన మార్క్ ను సంపాధింవచ్చు.

Moto Edge X30: సెక్స్

Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హాయ్ ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 12GB వరకు ర్యామ్ మరియు UFS 3.1 256GB వరకూ స్టోరేజ్ అందిస్తుంది.  

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP ప్రధాన సెన్సార్ కి జతగా5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు  2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో అందించింది.       

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :