Moto G82 5G: 50MP OIS కెమెరాతో రేపు లాంచ్ అవుతోంది..!!

Updated on 06-Jun-2022
HIGHLIGHTS

మోటోరోలా Moto G82 5G ను ఇండియాలో రేపు విడుదల చేస్తోంది

మోటో జి82 5జి 120Hz 10బిట్ pOLED డిస్ప్లేతో వస్తోంది

Dolby Atmos సౌండ్ స్పోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది

మోటోరోలా తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Moto G82 5G ను ఇండియాలో రేపు విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మర్కెట్ లో మంచి పోటీదారునిగా తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే Flipkart ద్వారా కంపెనీ అందించిన కీలకమైన వివరాల ప్రకారం ఈ ఫోన్ భారీ ఫీచర్లతో వస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ ఫోన్ లో బిలియన్ కలర్స్ అందించగల 10బిట్ pOLED ను అఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు,ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పొతే డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ మరియు ప్రాసెసర్ తో సహా కంప్లీట్ ప్యాకేజ్ గా ఈ ఫోన్ కనిపిస్తోంది. ఈ అప్ కమింగ్ మోటో స్మార్ట్ ఫోన్ ఎలా ఉండబోతోందో చూద్దామా.

Moto G82 5G:

 మోటో జి82 5జి స్మార్ట్ ఫోన్ ను 6.6 ఇంచ్ 10బిట్ pOLED  డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన డిస్ప్లేతో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే సాధారణ 8బిట్ డిస్ప్లే కంటే అధిక రంగులను చూపించగలదని కంపెనీ చెబుతోంది మరియు ఈ డిస్ప్లే పూంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన బడ్జెట్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.

టీజర్ ప్రకారం కెమెరా మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాని కలిగి ఉంటుంది. ఇందులో, 50MP OIS ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ గా రెండు పనులు చేసే 8MP సెన్సార్ మరియు మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని కలిగిఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ స్పోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :