Moto G715G: విడుదలకు సిద్ధమైన మరో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్

Updated on 06-Jan-2022
HIGHLIGHTS

Moto G71 5G ఇండియాలో విడుదలకు సిధ్దం

జనవరి 10 న ఇండియాలో విడుదలకానున్న మోటో జి71 5జి

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది

మోటరోలా ఇటీవల చైనాలో విడుదల చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Moto G71 5G ను ఇప్పుడు ఇండియాలో కూడా విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను జనవరి 10 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, ఈ ఫోన్ ను Flipkart ప్రత్యేకంగా తీసుకువస్తోంది మరియు ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ కూడా మొదలుపెట్టింది.

వాస్తవానికి, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో OLED డిస్ప్లే కలిగిన ఫోన్ గా నిలుస్తుంది. అయితే, Moto G71 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఎటువంటి డిస్ప్లేతో విడుదల చేస్తారో చూడాలి.

Moto G71 5G: స్పెక్స్

Flipkart లో అందించిన టీజింగ్ స్పెక్స్ ప్రకారం, మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది. దీనికి జతగా 128 GB స్టోరేజ్ కూడా జతచెయ్యబడింది. అంతేకాదు, ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు IP52 వాటర్ రెపెల్లెంట్ తో వస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ మోటో జి71 5జి లో వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్/డెప్త్ సెన్సార్ మరియు డేడికేటెడ్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది.

Moto G71 5G: ధర (చైనా వేరియంట్)

Moto G71 5G ఫోన్ యొక్క 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర RMB 1,699 (సుమారు రూ. 18,900).             

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :