రేపు విడుదల కానున్న మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

మోటోరోలా ఇండియాలో చాలా వేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది

ఇప్పుడు Moto e13 ను లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా ప్రకటించింది

ఈ స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరలో రావచ్చని ఆన్లైన్ రూమర్లు చెబుతున్నాయి

మోటోరోలా ఇండియాలో చాలా వేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఇప్పుడు మరొక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Moto e13 ను లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా ప్రకటించింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా వెల్లడించిడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరలో రావచ్చని ఆన్లైన్ రూమర్లు చెబుతున్నాయి. రేపు విడుదల కానున్న మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సంగతులేమిటో చూద్దామా.        

Moto e13: అంచనా ధర (రూమర్)

Moto e13 స్మార్ట్ ఫోన్ ను Rs.6,499 నుండి Rs.6,499 ధరలో మోటోరోలా లాంచ్ చేయవచ్చని ఆన్లైన్ రూమర్లు చెబుతున్నాయి. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ మోటోరోలా యొక్క ఎంట్రీ లెవల్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో అడుగుపెడుతుంది.   

Moto e13: స్పెషిఫికేషన్స్ (రివీల్డ్)

మోటోరోలా Moto e13 పెద్ద 6.5 ఇంచ్ IPS LCD డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో కలిగివుంటుంది. ఈ ఫోన్ Unisoc T606 చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 2GB/4GB ర్యామ్ మరియు పెద్ద 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం ఈ ఫోన్ IP52 వాటర్ రేపెళ్లేంట్ డిజన్ తో వస్తుంది.    

ఇక కెమెరా పరంగా, Moto e13 ఫోన్ వెనుక 13MP సింగిల్ కెమెరా సెటప్ తో వుంటుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 (Go Edition) తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ తో కూడా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :