Moto e7 Power ట్రెండీ ఫీచర్లతో ఈరోజు మధ్యాహ్నం లాంచ్ అవుతోంది

HIGHLIGHTS

Moto e7 Power ఈరోజు మధ్యాహ్నం ఇండియాలో విడుదలవుతుంది.

Moto e Power స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 అంగుళాల HD+ డిస్ప్లేతో వస్తుంది.

మోటో e7 పవర్ మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ అవుతుంది

మోటోరోలా Moto e7 Power ఈరోజు మధ్యాహ్నం ఇండియాలో విడుదలవుతుంది. మోటోరోలా ఈ Moto e Power స్మార్టు ఫోన్ ను ప్రస్తుతం వినియోగదారులు కోరుకుంటున్న అన్ని ఫీచర్లతో తీసుకొస్తున్నట్లు మోటో ఇప్పటికే టీజ్ చేస్తోంది. అంతేకాదు, Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ ను కూడా తెలిపింది. Moto e Power ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ అవుతుంది.   

Moto e7 Power స్పెక్స్

Moto e Power స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 అంగుళాల HD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రొసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 4GB LPDDR4X ర్యామ్ తో వస్తుంది. ఇక ఈ ఫోన్ 64 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించింది.

కెమెరాల విషయానికి వస్తే, Moto e Power  ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్పును అందించింది. ఇందులో ప్రధాన 13MP కెమెరాకి జతగా మరొక కెమెరాని అందించింది. ముందుభాగంలో సెల్ఫీల కోసం వాటర్ డ్రాప్ నోచ్ లో సెల్ఫీ కెమెరాని కూడా ఇచ్చింది. ఈ ఫోన్ మొత్తానికి పవర్ ఇవ్వడానికి పెద్ద 5000 mAh బ్యాటరీని కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :