Motorola:10బిట్ pOLED డిస్ప్లేతో కొత్త ఫోన్ లాంచ్.. మళ్ళి ఆకట్టుకున్న మోటోరోలా.!

HIGHLIGHTS

మోటోరోలా తన G సిరీస్ నుండి లేటెస్ట్ గా Moto G72 ను లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ 10బిట్ pOLED తో లాంచ్ చేసిన మోటోరోలా

మోటోరోలా తన G సిరీస్ నుండి లేటెస్ట్ గా Moto G72 ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 10బిట్ pOLED డిస్ప్లేతో లాంచ్ చేసి మోటోరోలా మళ్ళి ఆకట్టుకుంది. ఎందుకంటే, ఈ డిస్ప్లే లో ట్రూ లైఫ్ కలర్ లతో సినిమా మరియు ఫోటోలను ఆస్వాదించవచ్చు. అంతేకాదు, భారీ 108MP క్వాడ్ ఫిక్షన్ కెమెరా మరియు వేగవంతమైన గేమింగ్ ప్రాసెసర్ వంటి మరిన్ని ఫిచర్లను కూడా ఈ ఫోన్ లో జత చేసింది. మరి ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందామా.      

Moto G72: ప్రైస్ మరియు ఆఫర్స్

Moto G72 స్మార్ట్ ఫోన్ రూ.18,999 రూపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది మరియు ఇది 6GBర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ ఫోన్ అక్టోబర్  12 మధ్యాహం 12 గంటలకు Flipkart ద్వారా ఫస్ట్ సేల్ జరుగుతుంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనేవారికి 1,000 తగ్గింపు అఫర్ ను మోటోరోలా ప్రకటించింది. అంతేకాదు, ఎక్స్ చేంజ్ అఫర్ ద్వారా కొనేవారికి 3,000 రూపాయల అధనపు తగ్గింపు అఫర్ ను కూడా అందించింది. 

Moto G62 5G: స్పెక్స్

Moto G72 5G స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ FHD+ 10బిట్ pOLED డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G99 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాను  వుంది. ఇందులో 108MP ప్రధాన సెన్సార్, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా, 2MP మ్యాక్రో సెన్సార్ కూడా ఈ సెటప్ ట్లో వుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో ఉన్న పంచ్ హోల్ లో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ పెద్ద 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

ఈ ఫోన్ ఇతర ఫీచర్ల పరంగా, ఈ ఫోన్ బ్లోట్ వేర్ బడెదను లేని లేటెస్ట్ Near-Stock Android 12 OS పైన నడుస్తుంది మరియు IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. మంచి ఆడియోను కూడా ఇందులో యూజర్లు పొందుతారు. ఎందుకంటే, ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :