MOTOROLA G45 5G స్మార్ట్ ఫోన్ 10 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో వచ్చింది.!

HIGHLIGHTS

MOTOROLA G45 5G 10 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో వచ్చింది

మోటోరోలా అగ్రెసివ్ ప్రైస్ లో ఈ కొత్త ఫోన్ లాంచ్ చేసింది

ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ను రూ. 9,999 ధరకే అందుకోవచ్చు

MOTOROLA G45 5G స్మార్ట్ ఫోన్ 10 వేల బడ్జెట్ లో సూపర్ ఫీచర్స్ తో వచ్చింది. ఈ మాట ఈ ఫోన్ ఫీచర్స్ ను చూస్తే మీరే అంటారు. గత కొంత కాలంగా బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేసుకొని G సిరీస్ నుంచి వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూ వస్తున్న మోటోరోలా, ఇప్పుడు చాలా అగ్రెసివ్ ప్రైస్ లో ఈ కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ లేటెస్ట్ మరియు ట్రెండీ ఫీచర్స్ ను కలిగి ఉండడమే కాకుండా చవక ధరలో కూడా ఉంటుంది.

MOTOROLA G45 5G: ధర

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 10,999 ప్రారంభ ధరలో విడుదల చేసింది. ఈ బేసిక్ వేరియంట్ 4GB + 128GB తో వస్తుంది. అయితే, ఈ ఫోన్ రెండవ 8GB + 128GB వేరియంట్ ను కూడా కేవలం రూ. 12,999 ధరలో లాంచ్ చేసింది.

ఆఫర్స్:

Axis మరియు IDFC First బ్యాంక్ క్రెడిట్ మరియు EMI ఆప్షన్ లతో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ బ్యాంక్ ఆఫర్ తో రూ. 9,999 ప్రారంభ ధరకే అందుకోవచ్చు. ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ Flipkart మరియు motorola.in నుంచి మొదలవుతుంది.

MOTOROLA G45 5G: ఫీచర్స్

మోటోరోలా జి45 5జి స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6. 67 ఇంచ్ IPS LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ Snapdragon 6s Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 4GB / 8GB ర్యామ్ మరియు 8GB ర్యామ్ బూస్ట్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను ఈ 10 వేల బడ్జెట్ లో ఎన్నడూ లేని విధంగా ప్రీమియం వెగాన్ లెథర్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లలో అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 8MP డ్యూయల్ వుంది మరియు ఉందు 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 30fps వద్ద FHD వీడియోలు మరియు గొప్ప ఫోటోలు అందించే సత్తా కలిగి ఉంటుంది అని మోటోరోలా తెలిపింది.

Also Read: FHD టీవీ రేటుకే బ్రాండెడ్ 50 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ Dolby Atmos మరియు Hi-Res Audio సపోర్ట్ కలిగిన దూల స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్మార్ట్ కనెక్ట్, IP 52 రేటింగ్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 20W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :