MOTOROLA g24 Power: ప్రీమియం డిజైన్ మరియు Dolby Atmos తో చవక ధరలో లాంచ్.!

HIGHLIGHTS

MOTOROLA g24 Power ప్రీమియం డిజైన్ తో చవక ధరలో లాంచ్ అయ్యింది

మోటోరోలా జి24 పవర్ Dolby Atmos స్పీకర్లతో వచ్చింది

ఈ ఫోన్ బడ్జెట్ బీస్ట్ గా కనిపిస్తోంది

MOTOROLA g24 Power: మోటోరోలా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్ Dolby Atmos తో చవక ధరలో లాంచ్ అయ్యింది. 9 వేల బడ్జెట్ లో ఆకర్షణీయమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ తో వచ్చిన ఈ ఫోన్ మార్కెట్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లకు పోటీగా నిలుస్తుంది. ఈ ఫోన్ స్పెక్స్ షీట్ పైన అందించిన వివరాలను చూస్తే, ఈ ఫోన్ బడ్జెట్ బీస్ట్ గా కనిపిస్తోంది. ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.

MOTOROLA g24 Power: Price

మోటోరోలా జి24 పవర్ స్మార్ట్ ఫోన్ ను రూ. 8,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 4GB + 128 GB వేరియంట్ కోసం ఈ రేటును నిర్ణయించింది. జి24 పవర్ యొక్క 8GB + 128GB వేరియంట్ ను రూ. 9,999 ధరతో లాంచ్ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ Flipkart మరియు motorola.com నుండి మొదటి సేల్ జరుగుతుంది.

Also Read: Honor X9b: కుంకుడు కాయలు కొట్టినా పగలని ఫోన్ లాంచ్ చేయబోతున్న హానర్.!

మోటోరోలా జి24 పవర్ ప్రత్యేకతలు

మోటోరోలా జి24 పవర్ స్మార్ట్ ఫోన్ 6000mAh బిగ్ బ్యాటరీ మరియు 33 W TurboPower ఛార్జ్ సపోర్ట్ తో వచ్చింది. ఈ ఫోన్ అల్ట్రా ప్రీమియం డిజైన్ మరియు లైట్ వెయిట్ తో ఉంటుంది. ఈ మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ My UX సాఫ్ట్ వేర్ పైన Android 14 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ మరియు స్టీరియో స్పీకర్స్ తో మంచి సౌండ్ ఫీచర్స్ ను కలిగి వుంది.

ఇక ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. అలాగే, ఈ ఫోన్ లో 50MP + 2MP కూడా ఫిక్షన్ రియర్ కెమేరా సెటప్ మరియు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ ను MediaTek Helio G85 ఫాస్ట్ ప్రోసెసర్ తో లాంచ్ చేసింది మోటోరోలా. దీనికి జతగా 8 GB RAM మరియు 8 GB RAM Boost ఫీచర్ ను మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా మోటోరోలా జి24 పవర్ కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :