Motorola G04s: చవక ధరలో 50MP కెమెరాతో లాంచ్ చేసిన మోటోరోలా.!

HIGHLIGHTS

మోటోరోలా నుండి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు విడుదలయ్యింది

Motorola G04s నాలుగు కలర్ ఆప్షన్ లలో వచ్చింది

7 వేల ఉప బడ్జెట్ ధరలో మరిన్ని ఫీచర్లతో వచ్చింది

Motorola G04s: మోటోరోలా నుండి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు విడుదలయ్యింది. అదే, మోటోరోలా జి04s స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 7 వేల రూపాయల ఉప బడ్జెట్ లో 50MP కెమెరా వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈరోజే మార్కెట్లో కొత్తగా అడుగుపెట్టిన ఈ ఫోన్ యొక్క ఫీచర్స్, స్పెక్స్ మరియు ప్రైస్ వివరాల పై ఒక లుక్కేద్దామా.

Motorola G04s: ప్రైస్

మోటోరోలా జి04s స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 6,999 ధరలో (4GB + 64GB) సింగిల్ వేరియంట్ తో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కాంకర్డ్ బ్లాక్, శాటిన్ బ్లూ, సి గ్రీన్ మరియు సన్ రైజ్ ఆరెంజ్ వంటి నాలుగు కలర్ ఆప్షన్ లలో అందించింది. జూన్ 5వ తేది మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Motorola G04s: ప్రత్యేకతలు

మోటోరోలా జి04s స్మార్ ఫోన్ 6.6 ఇంచ్ బిగ్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది HD+ రిజల్యూషన్ మరియు 90 Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ UNISOC T606 ఆక్టా కోర్ 4G ప్రోసెసర్ మరియు 4GB RAM తో వస్తుంది. ఈ ఫోన్ లో 4GB ర్యామ్ బూస్ట్ ఫీచర్ వుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

Also Read: Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. ధర మరియు ఫీచర్లు ఇవే.!

ఇక ఈ ఫోన్ లో అందించిన కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ 50MP సింగల్ రియర్ కెమెరాతో వస్తుంది మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 30 fps వద్ద FHD వీడియోలను షూట్ చేయవచ్చు మరియు అనేకమైన కెమెరా ఫిల్టర్ లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది.

Motorola G04s Features

ఈ ఫోన్ లో అందించిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ కార్డ్ స్లాట్, Dolby Atmos సౌండ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14OS వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ తో ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకునే అవకాశం కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :