Motorola Edge 70 launched with super slim design and game change features
Motorola Edge 70 స్మార్ట్ ఫోన్ ఈరోజు దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ స్లిమ్ డిజైన్ మరియు జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఇప్పటికే ఎడ్జ్ సిరీస్ నుంచి కొత్త కొత్త ఫీచర్స్ తో ఫోన్స్ అందించిన మోటోరోలా ఈసారి ఈ ఫోన్ డిజైన్ మరియు AI ఫీచర్స్ పై ఎక్కువ దృష్టి సారించినట్లు ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ కంప్లీట్ గా తెలుసుకోండి.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం (8 జీబీ + 256 జీబీ) సింగల్ వేరియంట్ తో రూ. 29,999 ధరతో లాంచ్ చేసింది. డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రత్యేకంగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, మోటరోలా అఫీషియల్ వెబ్సైట్ మరియు అన్ని రియల్ స్టోర్స్ నుంచి కూడా లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో ఈ ఫోన్ పై గొప్ప ఆఫర్స్ కూడా మోటోరోలా అందించింది.
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ ఎక్స్ ట్రీమ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ గొప్ప 1.5K రిజల్యూషన్ ఫీచర్, HDR10+ సపోర్ట్, ఎండలో కూడా బాగా కనిపించేలా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఫీచర్, స్మూత్ విజువల్స్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్ మరియు స్క్రీన్ రక్షణ కోసం పటిష్టమైన గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 5.99mm మందంతో సూపర్ స్లీక్ ఫోన్ గా వచ్చింది మరియు ఈ ఫోన్ కేవలం 159 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.
ఈ మోటోరోలా కొత్త ఫోన్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో వచ్చింది మరియు జతగా 8జీబీ LPDDR5x ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ హలో UI సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16OS తో వచ్చింది. ఈ ఫోన్ మూడు సంవత్సరాల OS అప్డేట్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్ అందుకుంటుంది.
ఇక ఈ ఫోన్ కెమెరా సెటప్ విభాగానికి వస్తే, ఈ ఫోన్లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP ప్యాంటోన్ వ్యాలిడేట్ మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో సెన్సార్ జతగా డిడికేటెడ్ 3 ఇన్ 1 లైట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ మోటో Ai మరియు మరిన్ని ఎఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: రూ. 7000 ధరలో జబర్దస్త్ సౌండ్ అందించే బెస్ట్ 5.1 Dolby Soundbar ఆప్షన్ పై ఒక లుక్కేయండి.!
మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ ను 68W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో అందించింది. కేవలం 5.99mm మందంతో ఉన్న ఈ ఫోన్ లో ఇంత పెద్ద బ్యాటరీ అందించడం విశేషం. ఈ ఫోన్ మోటోరోలా సొంత Moto Ai, గూగుల్ యొక్క Gemini, Copilot మరియు Perplexity వంటి మల్టీ Ai ప్లాట్ ఫామ్స్ తో వచ్చింది. ఈ ఫోన్ IP 68 మరియు IP 69 రేటింగ్ తో డస్ట్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది మరియు మిలిటరీ గ్రేడ్ డ్యూరాబిలిటీ ప్రొటెక్షన్ తో వస్తుంది.