Motorola Edge 60 Stylus launching tomorrow but know the complete features before launch
Motorola Edge 60 Stylus స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ స్టైలస్ ఫోనుగా ఇండియన్ మార్కెట్లో ప్రవేశ పెట్టబోతున్నట్లు కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫీచర్స్ తో తీసుకొస్తున్నట్లు మోటోరోలా తెలిపింది. రేపు విడుదల కాబోతున్న ఈ మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ రేపు లాంచ్ అవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ద్వారా మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ చాలా కీలకమైన ఫీచర్స్ ముందే బయటకు వెల్లడించింది. కంపెనీ ప్రకారం, ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ AI స్కెచ్ టూ ఇమేజ్ సపోర్ట్ కలిగిన ఇన్ బిల్ట్ స్టైలస్ పెన్ తో వస్తుంది. అంతేకాదు, ఈ AI స్టైలింగ్ మరియు Glance AI తో ఇన్స్టాంట్ షాపింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్ సపోర్ట్ కలిగిన 6.7 ఇంచ్ pOLED డిస్ప్లే ఉంటుంది.
ఎడ్జ్ 60 స్టైలస్ ప్రీమియం పాంటోన్ కలర్స్ వేగన్ లెథర్ ఫినిష్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ MIL-810H సర్టిఫికేషన్ మరియు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony LYT 700C కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం ఉంటుంది మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 256GB హెవీ ఇన్ ఇంతర్గత స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్ ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 68W టర్బో పవర్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది.
Also Read: Infinix Note 50s 5G: అతి సన్నని కర్వుడ్ AMOLED స్క్రీన్ తో వస్తోంది.!
ఈ స్మార్ట్ ఫోన్ అండర్ 25K ధరలో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి, ఈ ఫోన్ ను బడ్జెట్ స్టైలస్ ఫోన్ గా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది కాబట్టి మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉండవచ్చని ఊహిస్తున్నారు. అయితే, రేపటితో ఈ ఫోన్ పియా ప్రస్తుతం నడుస్తున్న అంచనా ధర పై నీలి నీడలు తొలగిపోతాయి.