భారీ ఆఫర్స్ తో స్టార్ట్ కానున్న MOTOROLA Edge 60 Fusion 5G ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

MOTOROLA Edge 60 Fusion 5G సేల్ కి అందుబాటులోకి రానున్నది

మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ బెస్ట్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరకు అందుకోవచ్చు

ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ ఆల్ కర్వుడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది

భారీ ఆఫర్స్ తో స్టార్ట్ కానున్న MOTOROLA Edge 60 Fusion 5G ఫస్ట్ సేల్.!

MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్స్ తో రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది. ఈ మొదటి సేల్ నుంచి ఈ ఫోన్ బెస్ట్ డీల్స్ తో మంచి ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ ధర, ఫీచర్లు మరియు ఆఫర్స్ పూర్తిగా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

MOTOROLA Edge 60 Fusion 5G : ప్రైస్ మరియు ఆఫర్లు

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ బేసిక్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 22,999 ధరతో అందించింది. ఈ ఫోన్ హై ఎండ్ (12GB + 256GB) వేరియంట్ ను రూ. 24,999 ధరతో అందించింది. ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా అందించింది.

ఈ ఫోన్ ను Axis మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.

Also Read: Realme Narzo 80x 5G: రేపు లాంచ్ కానున్న ప్రైస్ మరియు పూర్తి ఫీచర్లు ముందే తెలుసుకోండి.!

MOTOROLA Edge 60 Fusion 5G : ఫీచర్లు

ఈ మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ ఆల్ కర్వుడ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 12GB ఫిజికల్ ర్యామ్, వర్చువల్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

MOTOROLA Edge 60 Fusion 5G

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Sony LYTIA 700C + 13MP + 3-in-1 లైట్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 4K Video రికార్డ్ సపోర్ట్, moto Ai ఫీచర్ తో Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3D సిలికాన్ వేగాన్ లెథర్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ మరియు MIL STD-810H వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జి స్మార్ట్ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 68 W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ లో Hi-Res Audio మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ నీటి నుంచి పూర్తి రక్షణ అందించే IP68 + IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo