మోటోరోలా ప్రీమియం 5G ఫోన్ ముందెన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది.!
ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలోనే అందుకోండి
మోటోరోలా ప్రీమియం ఇప్పుడు బడ్జెట్ ధరలోనే లభిస్తోంది
ఈ ఫోన్ Flipkart నుండి ప్రస్తుతం లాభోపేతమైన డీల్స్ తో లభిస్తోంది
ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలోనే కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్. మోటోరోలా ప్రీమియం స్పెక్స్ మరియు ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో అందించిన స్మార్ట్ ఫోన్ Motorola Edge 30 భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లతో ఇప్పుడు బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 50MP ప్రీమియం కెమేరా సెటప్, 144Hz 10 bit డిస్ప్లే మరియు మరిన్ని ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ Flipkart నుండి ప్రస్తుతం లాభోపేతమైన డీల్స్ తో లభిస్తోంది.
SurveyMotorola Edge 30: కొత్త ఆఫర్లు ఏమిటి
Motorola Edge 30 స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో 29,999 రూపాయల ధరతో వచ్చింది. అయితే, ఈ మోటో ప్రీమియం 5G ఫోన్ ఇప్పుడు రూ. 7,000 భారీ తగ్గింపుతో కేవలం రూ.22,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఇంత తక్కువ ధరలో ఈ ఫోన్ లభించడం ఇదే మొదటిసారి మరియు ఈ ఫోన్ ను అతి తక్కువ EMI తో కూడా కొనుగోలు చేసే అవకాశం అందించింది.
Motorola Edge 30: ప్రీమియం ఫీచర్లు ఏమిటీ
Motorola Edge 30 స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 ఇంచ్ 10bit pOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ కేవలం 6.99mm మందంతో చాలా సన్నని మరియు స్టైలిష్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క వేగవతమైన 5G ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 778+ SoC తో పనిచేస్తుంది. ముఖ్యంగా, ప్రీమియం 60MP సెల్ఫీ కెమేరాతో వచ్చిన మొదటి ఫోన్ కూడా ఇదే.
ఈ ఫోన్ లో వెనుక కూడా ప్రిమియం కెమేరా సెటప్ నే కలిగి వుంది. ఈ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 50MP మైన్ కెమేరా, 50MP అల్ట్రా వైడ్/మ్యాక్రో కెమెరాకి జతగా 2MP క్వాడ్ ఫంక్షన్ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4020 mAh బ్యాటరీని కలిగి వుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ Android 12 OS పైన పనిచేస్తుంది మరియు ఆండ్రాయిడ్ 13 మరియు 14 OS అప్డేట్ లను అందుకుంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
