బడ్జెట్ ధరలో 108MP కెమెరా 5G కోరుకునే వారికి బెస్ట్ అఫర్ ఫ్లిప్ కార్ట్ నుండి అందుబాటులో వుంది. ఇటీవల మోటోరోలా తీసుకొచ్చిన 5G స్మార్ట్ ఫోన్ Edge 20 Fusion ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన మోటోరోలా డేస్ సేల్ నుండి ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5G స్మార్ట్ ఫోన్ ఇంత వరకూ ఎప్పుడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 108MP క్వాడ్ ఫిక్షన్ కెమెరా, 5G ప్రొసెసర్ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. Flipkart ప్రకటించిన మోటోరోలా డేస్ సేల్ రేపటితో ముగియనున్నది కాబట్టి అఫర్ తో ఫోన్ కొనాలి అనుకునే వారు త్వరపడండి.
మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్ 6జిబి మరియు 128జిబి స్టోరేజ్ తో రూ.21,499 రూపాయల ప్రారంభధరతో ప్రకటించబడింది. అయితే, మోటోరోలా డేస్ సేల్ నుండి 3,500 రూపాయల భారీ తగ్గింపుతో కేవలం రూ.17,999 రూపాయల ధరకే లభిస్తోంది.
మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 6.7 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ AMOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ Dimensity 800U ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ సైబర్ టీఎల్ మరియు ఎలక్ట్రిక్ గ్రాఫైట్ అనే రెండు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
ఎడ్జ్ 20 ఫ్యూజన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. కానీ, ఇది క్వాడ్ కెమేరా పనులను చెయ్యగల శక్తితో వుంటుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో రెండిటికి సపోర్ట్ చేసే 8ఎంపి సెన్సార్ మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరాతో 8X వరకూ డిజిటల్ జూమ్ చెయ్యవచ్చని కంపెని తెలిపింది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ లో 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది మరియు టైప్ C ఛార్జర్ తో వస్తుంది.