మోటోరోలా ఇన్-డిస్ప్లే కెమెరా ఫోన్ వస్తోంది..!

Updated on 26-Jan-2022
HIGHLIGHTS

మోటోరోలా యొక్క ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్ గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ టీజ్ చేశారు

Edge X30 యొక్క స్పెషల్ ఎడిషన్ గా తీసుకువస్తునట్లు పేర్కొన్నారు

మోటోరోలా యొక్క ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్ గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ టీజ్ చేశారు. అయితే, ఇది కొత్త సిరీస్ నుండి కాకుండా గత సంవత్సరం చివరిలో Snapdragon 8 Gen 1 ప్రోసెసర్ తో విడుదల చేసిన Edge X30 యొక్క స్పెషల్ ఎడిషన్ గా తీసుకువస్తునట్లు పేర్కొన్నారు. అంతేకాదు,ఈ అప్ కమింగ్ Moto Edge X30 అండర్-స్క్రీన్ కెమెరా ఎడిషన్ బాక్స్ యొక్క ఇమేజీలను Lenovo యొక్క చైనా మొబైల్ ఫోన్ బిజినెస్ జనరల్ మేనేజర్ చెన్ జిన్ Weiboలో షేర్ చేసారు.

వాస్తవానికి, అండర్- డిస్ప్లే కెమెరా ఫోన్లు మునుపే వచ్చాయి మరియు ఇప్పుడు మరింత మెరుగవుతున్నాయి. అయితే, అండర్-డిస్ప్లే కెమెరా ఫోన్లలో వాటి ఫోటో నాణ్యత పైన కొంత ప్రభావం ఉంటుంది. అయితే, ప్రారంభంలో 2020 లో మొదటి అండర్ డిస్‌ప్లే కెమెరా ఫోన్ (ZTE Axon 20) ప్రారంభించినప్పటి నుండి పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి.

ఇక Moto Edge X30 అండర్-స్క్రీన్ కెమెరా స్పెషల్ ఎడిషన్ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఒరిజినల్ గ్లోబల్ వేరియంట్‌ను పోలి ఉండవచ్చని భావిస్తున్నారు.

Moto Edge X30: గ్లోబల్ వేరియంట్ స్పెక్స్

Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హాయ్ ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 12GB వరకు ర్యామ్ మరియు UFS 3.1 256GB వరకూ స్టోరేజ్ అందిస్తుంది.  

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP ప్రధాన సెన్సార్ కి జతగా5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు  2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో అందించింది. అయితే, ఇండియా లాంచ్ గురించి ఎటువంటి ప్రకటన లేదా సమాచారం కానీ బయటకీ రాలేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :