మోటరోలా 108MP కెమెరా 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్.!

Updated on 06-Aug-2022
HIGHLIGHTS

మోటోరోలా 5G ఫోన్ పైన Flipkart బిగ్ సేవింగ్ డేస్ 2022 సేల్ నుండి భారీ డిస్కౌంట్

Edge 20 Fusion ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది

ఈ ఫోన్ HDR 10+ సర్టిఫైడ్ AMOLED డిస్ప్లేని కలిగివుంటుంది

మోటోరోలా యొక్క 108MP కెమెరా 5G ఫోన్ Motorola Edge 20 Fusion స్మార్ట్ ఫోన్ Flipkart బిగ్ సేవింగ్ డేస్ 2022 సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ గత సంవత్సరం 108 క్వాడ్ ఫిక్షన్ కెమెరా సిస్టం, 5G ప్రొసెసర్ మరియు మరిన్ని ఫీచర్లతో రూ.21,499 రూపాయల ప్రారంభధరతో లాంచ్ చెయ్యబడింది. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.  మరి ఈ అఫర్ వివరాలు ఏమిటో చూద్దామా.   

Motorola Edge 20 Fusion: ప్రైస్ మరియు ఆఫర్లు

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్ 6జిబి మరియు 128జిబి స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి రూ.17,499 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క 8GB వేరియంట్ రూ.19,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో వుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Kotak మరియు ICICI కార్డ్స్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.   

Motorola Edge 20 Fusion: స్పెసిఫికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్  6.7 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ AMOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ Dimensity 800U ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ సైబర్ టీఎల్ మరియు ఎలక్ట్రిక్ గ్రాఫైట్ అనే రెండు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

ఎడ్జ్ 20 ఫ్యూజన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. కానీ, ఇది క్వాడ్ కెమేరా పనులను చెయ్యగల శక్తితో వుంటుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో రెండిటికి సపోర్ట్ చేసే 8ఎంపి సెన్సార్ మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరాతో 8X వరకూ డిజిటల్ జూమ్ చెయ్యవచ్చని కంపెని తెలిపింది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ లో 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది మరియు టైప్ C ఛార్జర్ తో వస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :