ఈరోజే Moto G9 మొదటి సేల్: బడ్జెట్ ధరలో టాప్ ఫీచర్లతో అలరిస్తుంది

Updated on 31-Aug-2020
HIGHLIGHTS

Moto G9 స్నాప్ డ్రాగన్ 622 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వచ్చిన మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్

Moto G9 వెనుక 48MP ట్రిపుల్ కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీ మరియు Turbo Speed ఛార్జింగ్ సపోర్ట్ వంటి బెస్ట్ ఫీచర్లతో తీసుకురాబడింది.

Moto G9 కేవలం 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియంట్ తో మాత్రమే లాంచ్ అయ్యింది.

ఇటీవల, మోటోరోలా సంస్థ తన Moto G9 స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను సరికొత్తగా క్వాల్కమ్ ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 622 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో అందించింది. ఈ ప్రాసెసర్ తో వచ్చిన మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే.  కేవలం ఇదొక్కటే కాదు, వెనుక 48MP ట్రిపుల్ కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీ మరియు Turbo Speed ఛార్జింగ్ సపోర్ట్ వంటి బెస్ట్ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకురాబడింది.               

Moto G9 Price

Moto G9  కేవలం 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియంట్ తో మాత్రమే లాంచ్ అయ్యింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే, ఇది కేవలం రూ .11,499 ధరతో మార్కెట్లో ప్రవేశించింది.  మోటో G9 మొబైల్ ఫోన్ యొక్క మొదటి సెల్ ఆగస్టు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరగుతుంది. ఈ సేల్  Flipkart  నుండి జరుగుతుంది.

Moto G9 ప్రత్యేకతలు

Moto G9 : డిస్ప్లే

ఈ మోటో G9 స్మార్ట్ ఫోన్ ఒక 6.5-అంగుళాల HD + డిస్ప్లే తో వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో లాంచ్ చేయబడింది. ఈ స్క్రీన్ మీకు 20: 9 యాస్పెక్ట్ రేషియో లభిస్తోంది కాబట్టి ఎక్కువ స్క్రీన్ ఏరియా మీకు అందుతుంది.

Moto G9: పెర్ఫార్మెన్స్

మోటో G9 స్మార్ట్ ఫోన్, Snapdragon 662 చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది మరియు ఈ చిప్సెట్ తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా Moto G9 నిలుస్తుంది.  ఇది ఆక్టా-కోర్ CPU  మరియు Adreno 610 GPU తో వస్తుంది. ఇక ప్రాసెసర్ కి జతగా 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ జతగా వస్తుంది. ఒక  మైక్రో SD కార్డ్ సహాయంతో 512 GB వరకూ స్టోరేజ్ కూడా పెంచవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 తో  నడుస్తుంది.

Moto G9 Camera

మోటో G9 స్మార్ట్ ఫోన్ లో, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ లో 48 MP  ప్రైమరీ కెమెరా అమర్చారు, దీనికి జతగా 2 MP మ్యాక్రో  కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సార్ ను కూడా అందించారు. ముందుభాగంలో, ఈ ఫోన్ లో 8 MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఇది ఫోన్ లో ఉన్న వాటర్ డ్రాప్ నోచ్ లో కనిపిస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో LED  ఫ్లాష్ ను కూడా చతురస్రాకారపు కెమేరా మాడ్యూల్ లో చూడవచ్చు.

Moto G9 బ్యాటరీ & సెక్యూరిటీ

ఇక సెక్యూరిటీ మరియు బ్యాటరీ విషయానికి వస్తే, ఈ G9 స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్ లో వేలిముద్ర సెన్సార్ ను అందించారు. అదనంగా, ఈ ఫోన్ లో ఒక పెద్ద 5000 mAh సామర్థ్యం గల బ్యాటరీతో మరియు 20 వాట్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంటే, ఈ బ్యాటరీ 20W టర్బో స్పీడ్ ఛార్జింగ్ సాంకేతికతో ఉంటుంది. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ మరియు సఫైర్ బ్లూ వంటి రెండు వేర్వేరు రంగులలో కొనుగోలు చేయవచ్చు.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :