Motorola G86 Power with super HD display and 4K camera launched
Motorola G86 Power స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో రిలీజ్ అయ్యింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ సూపర్ HD డిస్ప్లే మరియు 4K కెమెరాతో బడ్జెట్ ధరలో రిలీజ్ అయ్యింది. మోటోరోలా జి సిరీస్ నుంచి ఇటీవల వేగంగా కొత్త ఫోన్ లను అందించిన మోటోరోలా, ఈ సిరీస్ లో ఈ ఫోన్ ని కొత్త జత చేసింది. భారత మార్కెట్లో జస్ట్ ఇప్పుడే లాంచ్ అయిన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
మోటోరోలా జి86 పవర్ స్మార్ట్ ఫోన్ ను రూ. 17,999 ప్రైస్ ట్యాగ్ తో కేవలం సింగల్ వేరియంట్ లో అందించింది. అయితే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల లాంచ్ ఆఫర్ అందించడం ద్వారా ఈ ఫోన్ ను కేవలం రూ. 16,999 రూపాయల లాంచ్ ఆఫర్ ధరలో అందించింది. ఈ ఫోన్ ను ICICI, Axis, HDFC మరియు IDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. జూలై 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే మరియు లేటెస్ట్ ట్రెండీ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ Super HD AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. అంటే, ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే HDR10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది. జి 86 పవర్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 5జి చిప్ సెట్, 8GB ఫిజికల్ ర్యామ్, 8జీబీ ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ ఫీచర్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
జి 86 పవర్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP (Sony LYTIA 600) మెయిన్ కెమెరా జతగా 8MP మరియు మరో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP స్లఫై కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గొప్ప AI కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది.
Also Read: AI దెబ్బకు 90 శాతం పడిపోయిన Google Search మార్కెట్ షేర్ వాటా.!
ఈ ఫోన్ MIL-STD 810H మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ మరియు ముందు స్క్రీన్ పై పటిష్టమైన గొరిల్లా గొరిల్లా గ్లాస్ 7i సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6720 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W టర్బో పవర్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. మోటోరోలా అన్ని ఫోన్స్ మాదిరిగా ఈ ఫోన్ కూడా Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది.