భారీ ఫీచర్లతో వచ్చిన Moto G82 5G స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..!!

HIGHLIGHTS

మోటోరోలా ఈరోజు మార్కెట్లో Moto G82 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు మంచి ఫీచర్లతో లాంచ్ వచ్చింది

Moto G82 5G ను 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 10బిట్ pOLED తో అందించింది

మోటోరోలా ఈరోజు మార్కెట్లో Moto G82 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు మంచి ఫీచర్లతో లాంచ్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 10బిట్ pOLED తో అందించింది. అంతేకాదు, 50MP OIS ట్రిపుల్ కెమెరా బిగ్ బ్యాటరీ మరియు లేటెస్ట్ క్వాల్కమ్ 5G ప్రాసెసర్ వంటి మంచి ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరలో ప్రకటించింది. మరి ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదలైన ఈ మోటో స్మార్ట్ ఫోన్ వివరాలను తెలుసుకుందామా.

Moto G82 5G: Price

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను 6GB మరియు 8GB ర్యామ్ అప్షన్ తో 128GB స్టోరేజ్ తో అందించింది. ఇందులో,  6GB+128GB వేరియంట్ ధర రూ.21,499 కాగా 8GB+128GB వేరియంట్ ధర రూ.22,999 గా ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ అఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను SBI క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 1500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ జూన్ 14 నుండి Flipakrt మరియు Reliance Digital నుండి అందుబాటులోకి వస్తుంది.               

Moto G82 5G: Specs

మోటో జి82 5జి స్మార్ట్ ఫోన్ ను 6.6 ఇంచ్ 10బిట్ pOLED  డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన FHD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే సాధారణ 8బిట్ డిస్ప్లే కంటే అధిక రంగులను చూపించగలదని కంపెనీ తెలిపింది మరియు ఈ డిస్ప్లే పూంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన బడ్జెట్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB మరియు 128GB స్టోరేజ్ లను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది.     

ఇక కెమెరా మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాని కలిగి ఉంటుంది. ఇందులో, 50MP OIS ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ గా రెండు పనులు చేసే 8MP సెన్సార్ మరియు మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది.            

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :