10బిట్ pOLED తో వచ్చిన Moto G82 5G ఫస్ట్ సేల్..!!

HIGHLIGHTS

Moto G82 5G మొదటిసారిగా అమ్మకానికి రానుంది

ఈ స్మార్ట్ ఫోన్ ను 10బిట్ pOLED తో అదికూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది

ఈ స్మార్ట్ ఫోన్ పైన భారీ ఆఫర్లను కూడా మోటోరోలా ప్రకటించింది

మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Moto G82 5G మొదటిసారిగా అమ్మకానికి రానుంది. అంటే, మోటో జి82 5జి  స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ జూన్ 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి జరుగనుంది. మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను 10బిట్ pOLED తో అదికూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది. 50MP OIS ట్రిపుల్ కెమెరా బిగ్ బ్యాటరీ మరియు లేటెస్ట్ క్వాల్కమ్ 5G ప్రాసెసర్ వంటి మంచి ఫీచర్లతో వచ్చింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పైన భారీ ఆఫర్లను కూడా మోటోరోలా ప్రకటించింది.   

Moto G82 5G: ధర మరియు ఆఫర్లు

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను 6GB మరియు 8GB ర్యామ్ అప్షన్ తో 128GB స్టోరేజ్ తో అందించింది. ఇందులో,  6GB+128GB వేరియంట్ ధర రూ.21,499 కాగా 8GB+128GB వేరియంట్ ధర రూ.22,999 గా ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ అఫర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను SBI క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 1500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ జూన్ 14 నుండి Flipakrt మరియు Reliance Digital నుండి అందుబాటులోకి వస్తుంది.              

Moto G82 5G: Specs

మోటో జి82 5జి స్మార్ట్ ఫోన్ ను 6.6 ఇంచ్ 10బిట్ pOLED  డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన FHD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే సాధారణ 8బిట్ డిస్ప్లే కంటే అధిక రంగులను చూపించగలదని కంపెనీ తెలిపింది మరియు ఈ డిస్ప్లే పూంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన బడ్జెట్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/8GB మరియు 128GB స్టోరేజ్ లను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది.    

ఇక కెమెరా మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాని కలిగి ఉంటుంది. ఇందులో, 50MP OIS ప్రధాన కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ గా రెండు పనులు చేసే 8MP సెన్సార్ మరియు మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది.              

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :