Moto G8 పవర్ లైట్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో పెద్ద బ్యాటరీ, ట్రిపుల్ కెమేరాతో వస్తుంది

Updated on 22-May-2020
HIGHLIGHTS

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో పి 35 SoC తో నడుస్తుంది

లాంగ్ బ్యాటరీ జీవితంతో తక్కువ ధరలో వచ్చిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

తన ప్రధాన స్మార్ట్ ఫోన్ Moto Edge + ను ప్రారంభించిన కొద్ది రోజులకే, మోటరోలా రూపొందించిన మోటో జి 8 పవర్ లైట్ ను  భారతదేశంలో విడుదల చేసింది మరియు ఈ నెలాఖరులోగా అమ్మకాలను కూడా కొనసాగించనుంది. ఈ మోటరోలా స్మార్ట్‌ ఫోన్ లాంగ్  బ్యాటరీ జీవితంతో తక్కువ ధరలో వచ్చిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో పి 35 SoC తో నడుస్తుంది మరియు 5,000mAh బ్యాటరీని తీసుకొస్తుంది.

భారతదేశంలో మోటరోలా మోటో జి 8 పవర్ లైట్ :ధర మరియు అమ్మకం తేదీ

మోటో జి 8 పవర్ లైట్ సింగిల్ వేరియంట్లో 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ .8,999 మరియు ఫ్లిప్‌కార్ట్‌లో మే 29 నుండి మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలుకానుంది. ఈ ఫోన్ ఎంచుకోవడానికి రెండు రంగులు ఉన్నాయి – ఆర్కిటిక్ బ్లూ మరియు రాయల్ బ్లూ.

మీరు మోటో జి 8 పవర్ లైట్ కొనాలని ప్లాన్ చేస్తే మీకోసం ఫ్లిప్‌కార్ట్ అదనపు డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోలు చేస్తే మీకు 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కాబట్టి, దీని ధర 8,549 రూపాయలకు తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ నుండి  EMI ప్లాన్స్ కూడా అందిస్తోంది.

మోటో జి 8 పవర్ లైట్ : ప్రత్యేకతలు

మోటో జి 8 పవర్ లైట్ మీడియాటెక్ హెలియో పి 35 చిప్ సెట్ శక్తితో నడుస్తుంది మరియు ఆండ్రాయిడ్ 9 పై లో స్టాక్ UI తో నడుస్తుంది. ఈ ఫోన్ HD + రిజల్యూషన్ ‌తో కాంపాక్ట్ 6.5-అంగుళాల HD + IPS LCD డిస్ప్లే తో రాక్ చేస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజితో రోజువారీ ప్రాథమిక ఉపయోగం కోసం తయారు చెయ్యబడిన ఫోన్ ఇది.

మోటో జి 8 పవర్ లైట్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది, ఇది 16 MP ప్రైమరీ కెమెరాతో f / 2.0 ఎపర్చర్‌తో ఉంటుంది.  దీనితో మరొక 2 MP డెప్త్ సెన్సార్ మరియు 2 MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్, ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్ నోచ్ లో ఉంచబడింది.

స్మార్ట్ ఫోన్ 256GB వరకు మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా విస్తరించదగిన స్టోరేజితో  వస్తుంది మరియు 10W ఛార్జింగ్ కి మద్దతుతో 5,000mAh బ్యాటరీపై నడుస్తుంది. 4G LTE, బ్లూటూత్ 4.2 కు మద్దతు ఉంది మరియు మైక్రో- USB స్లాట్ తో వస్తుంది. ఇందులో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. బయోమెట్రిక్ ప్రామాణీకరణ కోసం బ్యాక్-మౌంటెడ్ వేలిముద్ర సెన్సార్ ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :