Moto G73 5G: బెస్ట్ అఫర్ తో మొదటి సేల్.. ఎప్పుడంటే..!

HIGHLIGHTS

Moto G73 5G మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది

ఈ స్మార్ట్ ఫోన్ పైన లాంచ్ అఫర్ లో భాగంగా మోటోరోలా మంచి ఆఫర్లను కూడా జతచేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను ఫస్ట్ సేల్ నుండే మీరు మంచి అఫర్ తో కొనుగోలు చేసే వీలుంది

మోటోరోలా ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ Moto G73 5G మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్నది. ఈ స్మార్ట్ ఫోన్ పైన లాంచ్ అఫర్ లో భాగంగా మోటోరోలా మంచి ఆఫర్లను కూడా జతచేసింది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను ఫస్ట్ సేల్ నుండే మీరు మంచి అఫర్ తో కొనుగోలు చేసే వీలుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు అఫర్ వివరాలను తెలుసుకోండి.             

Moto G73 5G: ధర మరియు ఆఫర్లు

Moto G73 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం 8GB RAM + 128GB స్టోరేజ్ సింగిల్ అప్షన్ తో రూ.18,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పైన అందించిన ఎక్స్ చేంజ్ అఫర్ లో భాగంగా 2,000 అదనపు డిస్కౌంట్ ను మీరు పొందవచ్చు. ఈ ఫోన్ పైన బ్యాంక్ ఆఫర్లు కూడా అంధుబాటులో వున్నాయి.  

Moto G73 5G: లీక్డ్ &అంచనా స్పెక్స్

Moto G73 5G స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ FHD+ IPS LCD డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు ఫోన్ 8.29. మందతో ఉంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 930 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను కలిగివుంటుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP+8MP రియర్ కెమెరాతో వుంది. ఇందులోని మైన కెమేరా 2 um Ultra-Pixel technology తో వస్తుంది.  ముందు పంచ్ హోల్ లో 16MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

ఈ ఫోన్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇది నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 13 OS, BT 5.2, 4x4MIMO మరియు 13 ఇండియన్ 5G బ్యాండ్స్ కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని కూడా మోటో తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :