Moto G71 5G: స్నాప్ డ్రాగన్ 695 5G ప్రోసెసర్ తో బడ్జెట్ ధరలో వచ్చింది

Updated on 10-Jan-2022
HIGHLIGHTS

Moto G71 5G ను బడ్జెట్ ధరలో ఇండియాలో విడుదల చేసింది

Snapdragon 695 5G ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్ గా మోటో G71 5G

క్వాడ్ ఫిక్షన్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్లతో తీసుకొచ్చింది

మోటోరోలా తన G సిరీస్ నుండి మంచి ఫీచర్లతో బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈరోజు ఈ సిరీస్ నుండి Moto G71 5G ను బడ్జెట్ ధరలో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను FHD+ AMOLED డిస్ప్లే, క్వాడ్ ఫిక్షన్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్లతో తీసుకొచ్చింది. మరి ముఖ్యంగా, Snapdragon 695 5G ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్ గా మోటో G71 5G నిలిచింది. 

Moto G71 5G: ప్రైస్

Moto G71 5G ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజ్ గల సింగిల్ వేరియంట్ తో వచ్చింది మరియు దీని ధర రూ. 18,999 రూపాయలు. ఈ స్మార్ట్ ఫోన్ జనవరి 19 నుండి Flipkart లో సేల్ కి అందుబాటులో ఉంటుంది.             

Moto G71 5G: స్పెక్స్

మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఇది పంచ్ హోల్ డిజైన్ మరియు DCI-P3 తో వస్తుంది.ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వచ్చింది మరియు ఈ ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్ గా కూడా నిలిచింది. ఈ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ తో జతచెయ్యబడింది. అధనంగా, ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు IP52 వాటర్ రెపెల్లెంట్ తో వస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, మోటో జి71 5జి లో వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్/డెప్త్ సెన్సార్ మరియు డేడికేటెడ్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది.

ఈ ఫోన్ ThinkShield మొబైల్ సెక్యురితో బిజినెస్ గ్రేడ్ సెక్యూరిటీ అఫర్ చేస్తుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా కలిగిఉంటుంది.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :