మోటోరోలా తన స్మార్ట్ ఫోన్లను చాలా వేగంగా మార్కెట్లో విడుదల చేస్తున్న కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఇటీవలే, ఇండియాలో బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో 5G స్మార్ట్ ఫోన్ ను ప్రకటించిన ఈ సంస్థ, ఇప్పుడు చైనాలో మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Moto G71 5G ను భారీ ఫీచర్లతో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ OLED డిస్ప్లే, బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని బెస్ట్ ఫీచర్లతో ఈ ఫోన్ ను విడుదల చేసింది.
మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ OLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ డిస్ప్లే 120HZ రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ కూడా జతచెయ్యబడింది. అంతేకాదు, 3GB వరకు వర్చువల్ ర్యామ్‌ను పెంచుకునే అవకాశం కూడా ఉంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ మోటో జి71 5జి లో వెనుక ట్రిపుల్ రియర్ వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 13MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది.
Moto G71 5G ఫోన్ యొక్క 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర RMB 1,699 (సుమారు రూ. 18,900).