రేపు ఇండియాలో విడుదలకానున్న Moto G71 5G స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

Moto G71 5G ను రేపు ఇండియాలో విడుదల అవుతోంది

మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది

ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది

మోటరోలా లేటెస్ట్  5G స్మార్ట్ ఫోన్ Moto G71 5G ను రేపు ఇండియాలో విడుదల అవుతోంది. ముందుగా, చైనాలో విడుదలైన ఈ మోటో 5G ఫోన్ ఇప్పుడు ఇండియాలో విడుదలకు సిద్దమయ్యింది. చైనాలో ఈ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చింది ఇండియాలో కూడా ఇదే ట్రెండ్ ఫాలో కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ Flipkart ప్రత్యేకంగా వస్తోంది మరియు మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ కూడా మొదలుపెట్టింది.

Moto G71 5G: స్పెక్స్

Flipkart లో అందించిన టీజింగ్ స్పెక్స్ ప్రకారం, మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ కూడా జతచెయ్యబడింది. అంతేకాదు, ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు IP52 వాటర్ రెపెల్లెంట్ తో వస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ మోటో జి71 5జి లో వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్/డెప్త్ సెన్సార్ మరియు డేడికేటెడ్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది.

Moto G71 5G:  చైనా వేరియంట్ ధర

Moto G71 5G ఫోన్ యొక్క 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర RMB 1,699 (సుమారు రూ. 18,900).            

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :