Moto G71 5G: Flipkart సేల్ నుండి భారీ ఆఫర్లతో ఫస్ట్ సేల్ రేపు జరగనుంది

Updated on 18-Jan-2022
HIGHLIGHTS

Moto G71 5G స్మార్ట్ ఫోన్ మొదటి సేల్

ఈ 5G స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది

మోటోరోలా ఇటీవల ఇండియాలో ప్రకటించిన Moto G71 5G స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా సేల్ కు వస్తుంది. ఈ 5G స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న Flipkart Big Saving Days సేల్ నుండి భారీ ఆఫర్లతో మొదైత్ సరి సేల్ కు అందుబాటులోకి వస్తోంది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్ తో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్, తక్కువ EMI అప్షన్ వంటి మరిన్ని ఆఫర్లలు లభిస్తున్నాయి. Snapdragon 695 5G ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్ గా మోటో G71 5G నిలిచింది.

Moto G71 5G: ప్రైస్

Moto G71 5G ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజ్ గల సింగిల్ వేరియంట్ తో వచ్చింది మరియు దీని ధర రూ. 18,999 రూపాయలు. ఈ స్మార్ట్ ఫోన్ జనవరి 19(అంటే రేపటి నుండి) Flipkart లో సేల్ కి అందుబాటులో ఉంటుంది.            

Moto G71 5G: స్పెక్స్

మోటో జి71 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఇది పంచ్ హోల్ డిజైన్ మరియు DCI-P3 తో వస్తుంది.ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వచ్చింది మరియు ఈ ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి ఫోన్ గా కూడా నిలిచింది. ఈ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ తో జతచెయ్యబడింది. అధనంగా, ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు IP52 వాటర్ రెపెల్లెంట్ తో వస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, మోటో జి71 5జి లో వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్/డెప్త్ సెన్సార్ మరియు డేడికేటెడ్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి వుంది.

ఈ ఫోన్ ThinkShield మొబైల్ సెక్యురితో బిజినెస్ గ్రేడ్ సెక్యూరిటీ అఫర్ చేస్తుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా కలిగిఉంటుంది.        

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :