లాంచ్ కంటే ముందే Moto G67 Power 5G టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!

Updated on 03-Nov-2025
HIGHLIGHTS

Moto G67 Power 5G స్మార్ట్ ఫోన్ మరో రెండు రోజుల్లో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ మరియు కీలక స్పెక్స్ సైతం ముందే బయటకు వెల్లడించింది

ఈ ఫోన్ ఫీచర్స్ పరంగా ఆకట్టుకునేలా ఉంటుంది

Moto G67 Power 5G స్మార్ట్ ఫోన్ మరో రెండు రోజుల్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ మరియు కీలక స్పెక్స్ సైతం ముందే బయటకు వెల్లడించింది. ఈ ఫోన్ బడ్జెట్ యూజర్ బేస్ ను టార్గెట్ చేసి లాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ ఫోన్ ఫీచర్స్ పరంగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కంటే ముందే మోటో జి 67 పవర్ టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.

Moto G67 Power 5G : లాంచ్ డేట్

మోటో జి 67 పవర్ స్మార్ట్ ఫోన్ నవంబర్ 5వ తేదీ మధ్యాహ్నం మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా అఫీషియల్ సైట్ ద్వారా సేల్ అవుతుంది.

Moto G67 Power 5G టాప్ 5 ఫీచర్స్

డిజైన్

ఈ ఫోన్ ను స్లీక్ మరియు ప్రీమియం వేగాన్ లెథర్ కలిగిన స్టైలిష్ డిజైన్ తో లాంచ్ చేస్తుంది. ఇది మిలటరీ గ్రేడ్ MIL -810H ప్రొటక్షన్ మరియు IP64 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో అందిస్తుంది.

డిస్ప్లే

మోటో జి 67 పవర్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే కలర్ బూస్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా కలిగి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్

ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. దానికి జతగా 8 జీబీ ఫిజికల్, 16 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ మోటో ఫోన్ హలో UX బేస్డ్ ఆండ్రాయిడ్ 15 OS పై పని చేస్తుంది.

బ్యాటరీ అండ్ ఆడియో

ఈ ఫోన్ సెగ్మెంట్ లీడింగ్ 7000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డాల్బీ అట్మాస్ మరియు Hi-Res Audio సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!

కెమెరా

ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సిస్టం అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు మరియు మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ అన్ని కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :