Moto G62 5G భారీ ఆఫర్లతో రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త మోటోరోలా 5G స్మార్ట్ ఫోన్ 12 5G బ్యాండ్ లకు సపోర్ట్ చేస్తుంది మరియు కేవలం రూ.17,999 రూపాయల బడ్జెట్ కేటగిరిలో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన Fluid డిస్ప్లేతో వచ్చింది. కేవలం డిస్ప్లే మాత్రమే కాదు కెమెరా, సౌండ్ మరియు బ్యాటరీ విభాగాల్లో కూడా మంచి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకువచ్చినట్లు మోటోరోలా పేర్కొంది. రేపు మొదటిసారిగా అమ్మకాలను కొనసాగించనున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, ఆఫర్లు మరియు స్పెక్స్ వంటి పూర్తి వివరాలను తెలుసుకోండి.
Moto G62 5G బేసిక్ వేరియంట్ (6GB+128GB) ధర రూ.17,999 రూపాయలు. హై ఎండ్ వేరియంట్ (8GB+128GB) ధర రూ.19,999 రూపాయలు. ఈ ఫోన్ ఆగష్టు 19 నుండి Flipkart ద్వారా ఉపలబ్ధమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC కార్డ్స్ ద్వారా కొనేవారికి 1,500 తగ్గింపు అఫర్ ను కూడా ప్రకటించింది.
Moto G32 5G స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ FHD+ Fluid డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు బ్రిలియంట్ కలర్ తో వుంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫంక్షన్ రియర్ కెమెరాతో వుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా 2MP మ్యాక్రో సెన్సార్ కూడా వుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి.