Moto G6 అండ్ Moto E5 సిరీజ్ ఏషియా లో అతి త్వరలో రిలీజ్….

Moto G6 అండ్ Moto E5 సిరీజ్ ఏషియా లో అతి త్వరలో రిలీజ్….

Motorola యొక్క రాబోయే Moto G6 మరియు Moto E5 సిరీస్ కొన్ని ఆసియా మార్కెట్లలో సర్టిఫికేట్ పొందింది. లెనోవా యొక్క యాజమాన్య అమెరికన్ బ్రాండ్ తన Moto G మరియు E స్మార్ట్ఫోన్ లైన్ తో 2013 మరియు 2014 లో విపరీతమైన విజయం సాధించింది . 

Moto G6 సిరీస్ తో, కొత్త లైనప్ 3 డివైసెస్ , మోటో G6, Moto G6 ప్లస్ మరియు Moto G6 ప్లే లు కలవు . ఈ డివైసెస్ మోడల్ నంబర్స్  XT1925-7, XT1926-5, మరియు XT1922-1 తో అందజేయబడ్డాయి, మరియు అన్ని ఇండోనేషియా మరియు థాయిలాండ్ లో TKDN మరియు NBTC ద్వారా అధికారిక ధృవీకరణ పొందాయి. అంతేకాకుండా, మోటరోలా ఇటీవల మలేషియాలో తన మోటో G6 ప్లే వేరియంట్ కోసం ధ్రువీకరణను కోరింది.

Moto G6 లైనప్ తో  పాటు, E5 ప్లే థాయిలాండ్ లో నియంత్రణ ఆమోదం వచ్చింది. ఆశాజనక Moto E5 మరియు Moto G6 సిరీస్ కొత్త గ్లాస్  మరియు అల్యూమినియం బాడీ తో  అమర్చారు.  ఈ డివైసెస్ లో  18: 9 యాస్పెక్ట్ రేషియో  మరియు Android 8.0 ఓరియో  ఉంటుందని భావిస్తున్నారు.

 

 

 

Digit.in
Logo
Digit.in
Logo