Moto G57 5G launching as worlds first Snapdragon 6s Gen 4 phone
మోటోరోలా G సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. అదే Moto G57 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 6s Gen 4 చిప్ తో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ అవుతుంది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ఈ ఫోన్ ఈ చిప్ సెట్ తో ప్రపంచంలో విడుదలయ్యే మొదటి ఫోన్ గా వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా విడుదల చేసింది.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ ఫోన్ కీలక ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ టీజర్ ని ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఫోన్ కోసం అందించిన ప్రత్యెకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు అందించింది.
మోటోరోలా లాంచ్ చేస్తున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 చిప్ సెట్ తో విడుదలయ్యే మొదటి ఫోన్ అవుతుంది. ఇది 4nm ప్రొసెస్ నోడ్‌లో తయారు చేయబడింది. దీనికి జతగా 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 16 జీబీ ర్యామ్ బూస్ట్ మరియు 128 జీబీ స్టోరేజ్ జత చేసింది. ఈ ఫోన్ లో FHD+ రిజల్యూషన్ కలిగిన 6.72 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1050 HBM బ్రైట్నెస్, కలర్ బూస్ట్ మరియు స్మార్ట్ వాటర్ టచ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది.
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Sony LYTA మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు మరో కెమెరాల కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది మోటో Ai సపోర్ట్ తో వస్తుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh సిలికాన్ కార్బన్ బిగ్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ లో కూడా ఈ పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
Also Read: kodak మోషన్ X సిరీస్ నుంచి పవర్ ఫుల్ సౌండ్ తో కొత్త QLED Smart Tvs లాంచ్ చేసింది.!
ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ MIL-STD 810H సర్టిఫికేషన్ తో మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ డిజైన్ తో ఉంటుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ IP64 వాటర్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అల్ట్రా ప్రీమియం వేగాన్ లెధర్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 OS అప్గ్రేడ్ తో పాటు మరో మూడు సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది.