Moto G34 5G: 50MP క్వాడ్ కెమేరా మరియు వేగాన్ లెథర్ తో లాంఛ్ అవుతోంది.!

HIGHLIGHTS

Moto G34 5G లాంచ్ డేట్ మరియు కీలకమైన స్పెక్స్ ను అనౌన్స్ చేసింది

ప్రీమియం ఫీచర్లతో లాంచ్ తో చేయబోతున్నట్లు టీజింగ్ చేస్తోంది మోటోరోలా

మోటో జి34 స్మార్ట్ ఫోన్ ను జనవరి 9న భారత్ లో లాంచ్ చేస్తోంది

మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Moto G34 5G లాంచ్ డేట్ మరియు కీలకమైన స్పెక్స్ ను కూడా అనౌన్స్ చేసింది. మోటో జి34 స్మార్ట్ ఫోన్ ను జనవరి 9న భారత్ లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ యూ స్నాప్ డ్రాగన్ 695 5జి ప్రోసెసర్ మరియు వేగాన్ లెథర్ వంటి ప్రీమియం ఫీచర్లతో లాంచ్ తో చేయబోతున్నట్లు టీజింగ్ చేస్తోంది మోటోరోలా. ఈ అప్ కమింగ్ మోటోరోలా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఎటువంటి ఫీచర్లను కలిగి ఉండబోతోందో ఒక లుక్కేద్దామా.

Moto G34 5G Teased Specs

మోటో జి34 5జి స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను కంపెనీ లాంచ్ కంటే ముందుగానే టీజింగ్ ద్వారా అందించింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ కానుంది. అందుకే , ఫ్లిప్ కార్ట్ మోటో జి34 5జి స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మాక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది.

Also Read : Gold Price: డౌన్ ఫాల్ ట్రెండ్ ఫాలో అవుతున్న గోల్డ్ మార్కెట్..!

మోటో జి34 5జి స్మార్ట్ ఫోన్ ను అల్ట్రా ప్రీమియం డిజైన్ మరియు వేగాన్ లెథర్ తో లాంచ్ చేస్తోంది. మోటో జి34 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్ట్ కోర్ 5జి ప్రోసెసర్ తో లాంచ్ చేస్తునట్లు తెలిపింది మోటోరోలా. ఈ ఫోన్ లో 50MP క్వాడ్ ఫిక్షన్ కెమేరా ఉన్నట్లు కూడా మోటోరోలా టీజింగ్ ద్వారా బయట పెట్టింది.

ఈ ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 ఇంచ్ డిస్ప్లేతో లాంచ్ తీసుకు వస్తున్నట్లు కూడా మోటోరోలా కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, మోటో జి34 ఫోన్ లోన 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా మోటోరోలా టీజింగ్ చేస్తోంది.

మోటోరోలా మోటో జి34 5జి స్మార్ ఫోన్ లాంచ్ కోసం మరింత సమయం ఉన్నది కాబట్టి ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ మరియు స్పెక్స్ ను కంపెనీ టీజింగ్ చేసే అవకాశం వుంది. వాస్తవానికి, ప్రస్తుతం బయటకి వచ్చిన వివరాలు ఇమేజెస్ చూస్తుంటే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో కాంపిటీటివ్ ప్రైస్ సెగ్మెంట్ లో లంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :