Moto G34 5G launch date and key specs tipped in online
మోటోరోలా అప్ కమింగ్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ Moto G34 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్లు ఇప్పుడు నెట్టింట్లో లీకయ్యాయి. నిజానికి లీక్ అయ్యాయి అనడం కంటే, ఎక్స్ క్లూజివ్ గా అందించ బడ్డాయి అనడం సమంజసం. ఎందుకంటే, ప్రముఖ లీక్ స్టర్లు మోటో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మోటో జి34 5జి యొక్క ఇమేజెస్ తో సహా లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్లు కూడా వారి ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ చేశారు.
మోటో జి34 5జి స్మార్ట్ ఫోన్ ను మోటోరోలా జనవరి 9వ తేదీ భారత్ మార్కెట్ లో విడుదల చేస్తుందని ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ వేల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఇమేజస్ మరియు లాంచ్ డేట్ కన్ఫర్మేషన్ తో ట్వీట్ ను అందించారు. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
ఈ ట్వీట్ ద్వారా, జనవరి 9 న మోటో జి34 5జి స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లంచ్ చేస్తుందని అర్ధమవుతుంది. అయితే, కంపెనీ నుండి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. ఈ లీక్డ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ మోటో జి సిరీస్ నుండి ముందుగా వచ్చిన ఫోన్ల మదిరాగానే స్లీక్ డిజైన్ మరియు వెనుక క్వాడ్ ఫిక్షన్ కెమేరా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
Also Read : Smart Tv: చవక ధరలో పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్నారా.!
ఇక ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ల వివరాల్లోకి వెళిస్తే, ఈ ఫోన్ ను బడ్జెట్ ఫాస్ట్ ప్రోసెసర్ Snapdragon 695 5G తో తీసుకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మోటో అప్ కమింగ్ ఫోన్ లో వేగన్ లెథర్ ఫినిష్, మరియు వెనుక కొత్త కెమేరా బంప్ ఉన్నాయి. ఈ ఫోన్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్ మరియు వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ ను లాగి ఉన్నట్లు అర్ధమవుతోంది.
ఈ ఫోన్ సన్నని అంచులు కలిగిన డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే, ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ తో పాటుగా కీలకమైన స్పెక్స్ తో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది.
ఇమేజ్ సోర్స్: ముకుల్ శర్మ ట్వీట్ నుండి తీసుకోబడినది