Moto G31: 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోంది ..స్పెక్స్ ఎలా ఉన్నాయంటే..!

HIGHLIGHTS

Moto G31 స్మార్ట్ ఫోన్ నవంబర్ 29న విడుదల అవుతుంది

కీలకమైన ఫీచర్లను కూడా ఇప్పటికే వెల్లడించింది

ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ కెమెరాతో వస్తోంది

Moto G31 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 29న మద్యహ్నం 12 గంటలకు విడుదల అవుతుంది. మోటరోలా యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా ఇప్పటికే వెల్లడించింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ అందించింది. అంటే, ఈ ఫోన్ అమెజాన్ ప్రత్యేకంగా అమ్మకాలను సాగిస్తుంది. ఈ ఫోన్ యొక్క టీజ్డ్ స్పెక్స్ ఈ క్రింద చూడవచ్చు. 

Moto G31: స్పెక్స్

మోటోరోలా Moto G31 ఫోన్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, 6.4 ఇంచ్ FHD డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 700 నైట్స్ బ్రైట్నెస్ మరియు పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ బడ్జెట్ ప్రాసెసర్ Helio G85 SoC తో తీసుకువస్తోంది. దీనికి జతగా 4GB/6GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ కెమెరాతో వస్తోంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. ఇక మూడవ సెన్సార్ మ్యాక్రో విజన్ సెన్సార్ ని అందించింది. పంచ్ హోల్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ను 5,000 mAh బిగ్ బ్యాటరీ, స్టాక్ ఆండ్రాయిడ్ OS మరియు వాటర్ రిపెలెంట్ డిజైన్ వంటి మరిన్ని బెస్ట్ ఫీచర్లతో లాంచ్ చేస్తున్నట్లు మోటరోలా చెబుతోంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :