మోటో డేస్ సేల్ నుండి Moto G31 పైన భారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

Moto G31 స్మార్ట్ ఫోన్ మోటో డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.10,999 ధరకే లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో AMOLED డిస్ప్లే Dolby Atoms తో వచ్చింది

మోటోరోలా ఇండియాలో మంచి ఫీచర్లతో తీసుకువచ్చిన Moto G31 స్మార్ట్ ఫోన్ మోటో డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో AMOLED డిస్ప్లే Dolby Atoms తో వచ్చింది. లాంచ్ సమయంలో రూ.12,999 ధరలో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.10,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా, బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు స్టాక్ ఆండ్రాయిడ్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. మరి ఈ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యొక్క అఫర్ వివరాలను చూసేద్దామా.  

Moto G31: ప్రైస్ మరియు ఆఫర్లు

Moto G31 రెండు వేరియంట్స్ లో లభిస్తుంది మరియు మోటో డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ సేల్ నుండి 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ ను 2,000 రూపాయల డిస్కౌంట్ తో రూ.12,999 రూపాయలకు పొందవచ్చు. ఇక మరొక వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ ని కూడా అదే డిస్కౌంట్ తో రూ.12,999 లకు పొందవచ్చు. అధనంగా, ఈ సేల్ నుండి  Kotak మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Moto G31: స్పెక్స్

మోటోరోలా Moto G31 ఫోన్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, 6.4 ఇంచ్ FHD AMOLED డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 700 నైట్స్ బ్రైట్నెస్ అందించ గలదు మరియు పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G85 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB/6GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాతోని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. ఇక మూడవ సెన్సార్ మ్యాక్రో విజన్ సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 13ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  20W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది.

ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ OS మరియు వాటర్ రిపెలెంట్ IPX2 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా తీసుకువస్తుంది. కాబట్టి, ఈ ఫోన్ ఈ ధరలో కంప్లీట్ ప్యాకేజ్ ఫోన్ గా మర్కెట్ లోకి వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :