మోటో G30 ఫోన్ 64MP క్వాడ్ కెమెరా స్టాక్ ఆండ్రాయిడ్ 11 తో వచ్చింది

HIGHLIGHTS

మోటోరోలా మోటో G30 ఈరోజు ఇండియాలో విడుదలయ్యింది.

ఆండ్రాయిడ్ 11 మరియు 64ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది.

మోటోరోలా మోటో G30 ఈరోజు ఇండియాలో విడుదలయ్యింది. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 మరియు 64ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో 5000mAh బ్యాటరీ మరియు 20W వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం IP52 రేటింగ్ తో వస్తుంది.     

మోటో G30: ధర

మోటో G30 (4జీబీ + 64 జీబీ ) : రూ.10,999

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చి 17 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది.   

ఈ మోటో G30 స్మార్ట్ ఫోన్ 6.5 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన వాటర్ డ్రాప్ డిజైన్ ని అందించింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం IP52 రేటింగ్ తో వస్తుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  662 ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 610 GPU తో పనిచేస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది నియర్ ఆండ్రాయిడ్ 11-స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది.

ఇక కెమెరాల పరంగా, మోటో G30 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 64MP కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో వాటర్ డ్రాప్ నోచ్ లోపల 13 MP సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 20W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :