Moto G22: ఆండ్రాయిడ్ 12 తో విడుదలైన మోటరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

Moto G22 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో విడుదలయ్యింది

మోటో జి22 Android 12 OS పై నడుస్తుంది

ఈ ఫోన్ Helio G37 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది

మోటోరోలా లేటెస్ట్ గా Moto G22 స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ తో ప్రకటించింది. అయితే, రాబోయే వారాల్లో ఈ Moto G22 భారతదేశంతో సహా ఆసియాకు మరియు అలాగే లాటిన్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ వంటి ఇతర మార్కెట్లకు రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు 50MP క్వాడ్ రియర్ కెమెరా వంటి మరిన్ని ప్రత్యేకతలతో ప్రపంచ మార్కెట్లో ఆవిష్కరించింది.

Moto G22: స్పెక్స్

మోటో జి22 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే మధ్యలో పంచ్ హోల్ డిజైన్ ను కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మోటో జి22 Android 12 ఆధారంగా Motorola యొక్క My UX సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ తో 256GB వరకూ మెమొరీని విస్తరించవచ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో వున్నా సెంటర్ పంచ్ హోల్ కటౌట్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది.  ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ నానో-సిమ్, USB-C సాకెట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 తో ఉంటుంది.

Moto G22: ధర

మోటో జి22 స్మార్ట్ ఫోన్ యూరోప్‌ లో 169.99 యూరోలు (సుమారు Rs.14,255) ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లూ, వైట్, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :