Moto G06 Power: 7 వేల ప్రైస్ సెగ్మెంట్ లో 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

Updated on 07-Oct-2025
HIGHLIGHTS

మోటోరోలా ఈరోజు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటో జి06 పవర్ ని లాంచ్ చేసింది

భారీ 7000 mAh బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ బడ్జెట్ ధరలో ఎన్నడూ లేని విధంగా మూడు బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది

Moto G06 Power: మోటోరోలా ఈరోజు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటో జి06 పవర్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 7 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో భారీ 7000 mAh బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకుందామా.

Moto G06 Power: ప్రైస్

మోటో జి06 పవర్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,499 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లారెల్ ఓక్, టాపేస్ట్రీ మరియు తెండ్రిల్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. అక్టోబర్ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Moto G06 Power: ఫీచర్స్

మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు వెనుక ప్రీమియం వేగాన్ లెథర్ డిజైన్ ఉంటుంది. ఈ ఫోన్ 6.88 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగిన స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G81 Extreme ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 4 జీబీ ర్యామ్, 8GB ర్యామ్ బూస్ట్ జతగా 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది.ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో భారీ 7000 mAh బ్యాటరీని అందించింది మోటరోలా. ఈ బిగ్ బ్యాటరీతో ఈ ఫోన్ మూడు రోజులు పని చేస్తుందని మోటోరోలా చెబుతోంది.

Also Read: OnePlus యూజర్లకు గుడ్ న్యూస్: OxygenOS 16 లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ.!

ఈ ఫోన్ IP 64 రేటెడ్ వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో ఎన్నడూ లేని విధంగా మూడు బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 7000 mAh బ్యాటరీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ మరియు ప్రీమియం వేగాన్ లెథర్ డిజైన్ వున్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :