60MP సెల్ఫీ కెమెరా స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది…ఇతర ఫీచర్లు కూడా అదుర్స్..!

Updated on 07-Dec-2021
HIGHLIGHTS

Moto Edge X30 స్మార్ట్ ఫోన్ లాంచ్

60MP భారీ సెల్ఫీ కెమెరాని ఇందులో ఇముడ్చుకుంటుంది

మోటరోలా భారీ ఫీచర్లతో తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా, 60MP సెల్ఫీ కెమెరా మరియు 69W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి చాలా భారీ ఫీచర్లను కలిగి ఉన్నట్లు మోటోరోలా చెబుతోంది. అదే, Moto Edge X30 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను డిసెంబర్ 9 న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ ను ముందుగా చైనాలో లాంచ్ చేస్తోంది ఈ లాంచ్ డేట్ కూడా చైనా వేరియంట్  కోసం ప్రకటించినదే. ఈ ఫోన్  యొక్క వివరాలు కూడా TEENAA లిస్టింగ్ ద్వారా వెల్లడయ్యాయి.

Moto Edge X30: సెక్స్

TEENAA లిస్టింగ్ ప్రకారం, Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.67 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 60MP భారీ సెల్ఫీ కెమెరాని ఇందులో ఇముడ్చుకుంటుంది. అదనంగా, ఈ డిస్ప్లే 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హాయ్ ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

అలాగే లీకైన మరొక నివేదిక ప్రకారం, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP ప్రధాన సెన్సార్ కి జతగా 2MP సెన్సార్లు కూడా ఉంటాయి. పైన తెలిపిన విధంగా 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీతో రానుంది. ఈ బ్యాటరీ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.అయితే, ఇండియా లాంచ్ గురించి ఎటువంటి ప్రకటన లేదా సమాచారం కానీ బయటకీ రాలేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :