Snapdragon 8 Gen 1 తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ మోటో ఎడ్జ్ X30

Updated on 12-Dec-2021
HIGHLIGHTS

Moto Edge 30x ను భారీ ఫీచర్లతో లాంచ్

Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో వచ్చిన మొదటి ఫోన్ మోటో ఎడ్జ్ X30

అతిభారీ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది

మోటరోలా తన ఫ్లాగ్ షిప్ ఫోన్ Moto Edge 30x ను భారీ ఫీచర్లతో లాంచ్ చేసింది. అంతేకాదు, Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో వచ్చిన మొదటి ఫోన్ గా ఈ మోటో ఎడ్జ్ X30 స్మార్ట్ ఫోన్ నిలుస్తుంది. ఇది మాత్రమేకాదు 60MP భారీ సెల్ఫీ కెమెరా, 69W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అతిభారీ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, ఈ ఫోన్ చైనాలో లాంచ్ చేయబడింది.   

Moto Edge X30: సెక్స్

Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హాయ్ ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 12GB వరకు ర్యామ్ మరియు UFS 3.1 256GB వరకూ స్టోరేజ్ అందిస్తుంది.   

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP ప్రధాన సెన్సార్ కి జతగా5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు  2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో అందించింది. అయితే, ఇండియా లాంచ్ గురించి ఎటువంటి ప్రకటన లేదా సమాచారం కానీ బయటకీ రాలేదు.

Moto Edge X30: ధర

Moto Edge X30 స్మార్ట్ ఫోన్ 8GB మరియు 12GB వేరియంట్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ RMB 2999 (సుమారు రూ. 35,540) నుండి ప్రారంభమవుతుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :