మోటోరోలా యొక్క ప్రీమియంస్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్ 40మే 23 న ఇండియాలో విడుదల అవుతోంది. మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో పాటుగా మరిన్ని వివరాలను కంపెనీ ఇప్పటికే తన టీజర్ ద్వారా పంచుకుంది. మరి రేపు ఇండియాలో విడుదల కానున్న ఈ మోటో ప్రీమియం స్మార్ట్ ఫోన్ యొక్క సంగతులు ఏమిటో తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
మోటోరోలా యొక్క మోటో ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ ను భారీ మరియు ప్రీమియం ఫీచర్లతో తీసుకు వస్తునట్లు మోటో టీజింగ్ ద్వారా గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో డిస్ప్లే మొదలుకొని కెమేరాల వరకూ అన్ని ప్రీమియం ఫీచర్లనే అందించినట్లు మోటరోలా ప్రత్యేకంగా చెబుతోంది.
ఈ ఫోన్ గురించి ఇప్పటి వరకూ అందించిన టీజింగ్ ద్వారా ఈ ఫోన్ లో 50MP OIS డ్యూయల్ రియర్ కెమేరా, ప్రీమియం లెథర్ డిజైన్, మీడియాటెక్ Dimensity 8020 ఫాస్ట్ 5G ప్రోసెసర్, 144Hz 3D Curved Display మరియు Dolby Atmos సపోర్ట్ స్టీరియో స్పీకర్లు మరియు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ వంటి మరిన్ని ప్రీమియం ప్రత్యేకతలను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నట్లు కంపెనీ టీజింగ్ నుండి చెబుతోంది.