భారీ స్పెక్స్ మరియు ఫీచర్లతో మోటరోలా ఇటీవల ఇండియాలో విడుదల చేసిన హైఎండ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్ 30 ప్రో మొదటిసారిగా అమ్మకాలను కొనసాగించనుంది. ఈ ఫోన్ యొక్క సేల్ రేపటి నుండి మొదలవుతుంది మరియు అదే రోజున ఫ్లిప్ కార్ట్ బిగ్ బాచాత్ ధమాల్ సేల్ కూడా మొదలవుతుంది. ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ పైన మంచి ఆఫర్లను కూడా అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనేవారికి రూ.5,000 రూపాయల తగ్గింపును లాంచ్ అఫర్ లో భాగంగా మోటో ప్రకటించింది.
మోటో ఎడ్జ్ 30 ప్రో ఒక హై ఎండ్ స్మార్ట్ ఫోన్ మరియు ఇది రూ.49,999 రూపాయాల ప్రీమియం ధరతో వచ్చింది. అయితే, ఈ ఫోన్ పైన కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్ ను కూడా మోటోరోలా అందించింది. SBI క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి 5,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ మార్చ్ 4 వ తేదీ నుండి Flipkart మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ లో లభిస్తుంది.
Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హై ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది.
ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP OIS ప్రధాన సెన్సార్ కి జతగా 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో అద్భుతమైన ఫోటో గ్రఫీని ఎంజాయ్ చేయవచ్చని మోటో తెలిపింది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అందించింది.