మోటరోలా లేటెస్ట్ గా యూరేపియన్ మార్కెట్లో తన Moto E32s స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన ఫీచర్లతో అందించింది. ఈ మోటో e32s ను బడ్జెట్ ధరలో 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, పెద్ద 5,000mAh బ్యాటరీతో పాటుగా మరిన్ని మంచి ఫీచర్లతో యూరేపియన్ మార్కెట్లో విడుదల చేసింది. మరి ఈ లేటెస్ట్ మోటో స్మార్ట్ ఫోన్ లో ఎటువంటి వివరాలు ఉన్నాయో చూద్దామా.
మోటోరోలా Moto E32s పెద్ద 6.5 అంగుళాల HD డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G37 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా వేగవంతమైన LPDDR4X 4GB ర్యామ్ మరియు పెద్ద 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
ఇక కెమెరా పరంగా, Moto E32s ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులో, 16MP మైన్ కెమెరా మరియు 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ కెమెరా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో కూడా 16MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ సైడ్- మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ కూడా కలిగి ఉంటుది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని అందించింది.ఈ ఫోన్ 4G LTE, WiFi, బ్లూటూత్, FM రేడియో, 3.5mm ఆడియో జాక్ మరియు USB-C 2.0 పోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.
Moto E32s ప్రారంభ ధర EUR 149.99 (సుమారు రూ. 12,400) . ఈ ఫోన్ స్లేట్ గ్రే లేదా మిస్టీ సిల్వర్ కలర్ అప్షన్లలో లభిస్తుంది.