మోటో లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ధర మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.!

HIGHLIGHTS

మోటోరోలా ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

Moto e13 ఫోన్ ను చాలా చవక ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకొచ్చినట్లు మోటోరోలా తెలిపింది

ఈ మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా

మోటోరోలా ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే, Moto e13 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను చాలా చవక ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకొచ్చినట్లు మోటోరోలా తెలిపింది. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన ఈ మోటో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.         

Moto e13: ధర

Moto e13 స్మార్ట్ ఫోన్ ను Rs.6,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది 2GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ ధర. ఇందులో, 2GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ కూడా వుంది దీని దర Rs.7,999. ఈ స్మార్ట్ ఫోన్ Flipkart ద్వారా ఫిబ్రవరి 15 వ తేది నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.   

Moto e13: స్పెషిఫికేషన్స్

మోటోరోలా Moto e13 పెద్ద 6.5 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో కలిగివుంటుంది. ఈ ఫోన్ Unisoc T606 చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 2GB/4GB ర్యామ్ మరియు పెద్ద 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం ఈ ఫోన్ IP52 వాటర్ రేపెళ్లేంట్ డిజన్ తో వస్తుంది.    

ఇక కెమెరా పరంగా, Moto e13 ఫోన్ వెనుక 13MP సింగిల్ కెమెరా సెటప్ తో వుంటుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 (Go Edition) తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ తో కూడా ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :