Micromax గ్రాండ్ రీ ఎంట్రీ : ఒకేసారి 3 కొత్త స్మార్ట్ ఫోన్లను తెస్తోంది

Updated on 19-Jun-2020
HIGHLIGHTS

భారతదేశ మొబైల్ తయారీ సంస్థ Micromax తన కొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Micromax సంస్థ మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.

భారత-చైనా సరిహద్దు ఘర్షణలు మొదలుకొని భారతీయులలో చైనీస్ ప్రోడక్ట్ వ్యతిరేఖ భావాలు మరింతగా పెరిగడమేకాకుండా, భారతదేశంలో తయారు చేసిన స్మార్ట్ ఫోన్లు లేదా భారతీయ కంపెనీలు తయారుచేసిన ఫోన్లను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. నానాటికి పెరుగుతున్న ఈ ధోరణి ఆన్లైన్ మరియు షోషల్ మీడియాలో మరింతగా కనిపిస్తోంది.

ఇప్పుడు, భారతదేశ మొబైల్ తయారీ సంస్థ Micromax తన కొత్త స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అదికూడా, ఒకటి రెండు కాదు ఏకంగా మూడు స్మార్ట్ ఫోన్లను దేశీయంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ వార్తను ముందుగా Gadgets 360 ప్రచురించింది. దీని ప్రకారం, Micromax సంస్థ మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. అంతేకాదు, ఈ మూడు ఫోన్లు కూడా అండర్ 10,000, అంటే పదివేల రూపాయల కంటే తక్కువ ధరలో తీసుకువడానికి చూస్తున్నట్లు కూడా తెలిపింది.

వాస్తవానికి, 2018 లో కూడా Micromax తన Infinity N11 మరియు N12 స్మార్ట్ ఫోన్లను మంచి ప్రత్యేకతలతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను కూడా 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో 2GB/3GB  RAM మరియు 32GB ఇంటర్నల్ మెమరీతో ప్రకటించింది. మైక్రోమ్యాక్స్ ఇన్ఫినిటీ N11 మరియు N12 లు వరుసగా రూ .8,999 మరియు రూ .9,999 ధరతో ఇండియాలో విడుదలయ్యాయి. ఇటీవల కూడా Micromax తన iONE Note స్మార్ట్ ఫోన్ను బడ్జెట్ ధరలో ఇండియాలోవిడుదల చేసింది.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :