మరొక 48MP కెమేరా ఫోన్ : Meizu Note 9
ఈ స్మార్ట్ ఫోన్ రెడ్మి నోట్ 7 వలెనే స్నాప్ డ్రాగన్ 675 SoC మరియు 48MP ప్రధాన కెమెరాతో ఉంటుంది.
Mizu తన Note 9 ని చైనాలో విడుదలకి చేసింది. ఈ స్మార్ట్ ప్రత్యేకత ఏమనుకుంటున్నారా? ఇది దాదాపుగా షావోమి సరికొత్తగా విడుదల చేసిన రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ను పోలి ఉంటుంది. ఇది ప్రాసెసర్ మరియు కెమెరాల విభాగంలో దాదాపుగా రెడ్మి నోట్ 7 ప్రో ని పోలివుంటుంది. అయితే, ఇందులో ప్రధాన 48MP కెమేరా మాత్రం ఒక Samsung ISOCELL GM 1 సెన్సార్ తో అందించింది.
SurveyMizu Note 9 ప్రత్యేకతలు
ఈ మైజు నోట్ 9, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 18.7:9 యాస్పెక్ట్ రేషియాతో 2244×1080 పిక్సెళ్ళుఅందించగల ఒక 6.2-అంగుళాల డిస్పల్ తోవస్తుంది. ఈ ఫోన్ ఒక 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది మరియు ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.
ఈ మైజు నోట్ 9, పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 48MP సెన్సారు కలిగి ఉంటుంది.అయితే, రెడ్మి నోట్ 7 ప్రో యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడితే, ఈ మీజు నోట్ 9 యొక్క 48MP ప్రధాన కెమేరా ఒక Samsung ISOCELL GM 1 మరియు f/1.7 ఎపర్చరుతో వస్తుంది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్ మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 20MP కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఇండియా విడుదదల గురించిన సమాచారం ఇంకా వెల్లడించలేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile